వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో మాట్లాడేది ఆ నలుగురేనా?.. మెజార్టీ ఎమ్మెల్యేలు సైలెంట్!

|
Google Oneindia TeluguNews

ఏపీలో టిడిపి డోలాయమాన పరిస్థితిలో ఉంది. గత ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితం అయిన టిడిపి వల్లభనేని వంశీ పార్టీని వీడగా ప్రస్తుత 22 మంది ఎమ్మెల్యేలతో నెట్టుకొస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలలో టిడిపిలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో కేవలం నలుగురు మాత్రమే ప్రతిపక్ష పార్టీ తరఫున తమ గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ అంటే ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందో అని సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది.

సభా పర్వం: ఏపీ అసెంబ్లీలో నేడు 11 కీలక బిల్లులు..అన్నీ కీలక నిర్ణయాలే !!సభా పర్వం: ఏపీ అసెంబ్లీలో నేడు 11 కీలక బిల్లులు..అన్నీ కీలక నిర్ణయాలే !!

సభలో వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు

సభలో వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. అయితే అసలే బలహీనంగా ఉన్న టీడీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి మరింత బలహీనం చేయాలనే ఎత్తుగడలో వైసిపి వ్యూహాలు పన్నుతోంది. ఇక టిడిపి వైసిపి వ్యూహాలను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతోంది.

 టీడీపీని నిర్వీర్యం చేసే ప్లాన్ లో వైసీపీ

టీడీపీని నిర్వీర్యం చేసే ప్లాన్ లో వైసీపీ

సభలో టీడీపీకి బలం లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. . అందుకు తగ్గట్టే టిడిపి నుండి కొందరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి పావులు కదుపుతున్నారు. ఇక ఇదే సమయంలో అధికారం కోల్పోయిన,ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతలుగాఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ సభలో యాక్టివ్ రోల్ తీసుకోకపోవటం అందుకు ఊతం ఇస్తుంది.

అసెంబ్లీలో టీడీపీ గొంతు వినిపిస్తుంది బాబుతో పాటు మరో ముగ్గురు మాత్రమే

అసెంబ్లీలో టీడీపీ గొంతు వినిపిస్తుంది బాబుతో పాటు మరో ముగ్గురు మాత్రమే

టీడీపీ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించాలి .ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి .కానీఏపీ అసెంబ్లీ లో వైసిపి మాటల దాడినికానీ,ప్రజా సమస్యలపైన ప్రస్తావన కానీచేస్తుంది ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే . అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు , గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే టీడీపీ నుండి మాట్లాడుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాలలోనూ వారే తమ గొంతును ప్రధానంగా వినిపించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటుకేవలం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీ వేదికగా తమ వాణిని వినిపిస్తున్నారు.

సైలెంట్ గా ఉన్న మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు

సైలెంట్ గా ఉన్న మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు

వైసిపి దాడిని తట్టుకునిఎదురు దాడి చేయడానికి టిడిపి నుండి చంద్రబాబు కు బాసటగా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నారు.అచ్చె నాయుడు, నిమ్మల రామానాయుడు,గోరంట్ల బుచ్చయ్య చౌదరిఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమేఅధికార పార్టీ పైన ఎదురుదాడి చేస్తున్నారు.వైసిపి విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూ,వాటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.మిగతా వారంతా సైలెంట్ గా ఉన్నారు.

బలమైన నాయకులు ఉన్నా అసెంబ్లీలో మౌన వ్రతమే

బలమైన నాయకులు ఉన్నా అసెంబ్లీలో మౌన వ్రతమే

ఇక పయ్యావుల కేశవ్,కరణం బలరాం వంటి సీనియర్ నాయకులు టీడీపీలో ఎమ్మెల్యేలుగాఉన్నారు.కానీ వారి వాణి సభలో వినిపించటం లేదు. వెలగపూడిరామకృష్ణ ,నందమూరి బాలకృష్ణ వంటి నేతలు ఉన్నా ఎవరూ మాట్లాడని పరిస్థితి. టిడిపి అధినేత చంద్రబాబుకు బాసటగా నిలవడం లేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే పార్టీకి దూరం కాగా, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను అంటి ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారు.

ఏం మాట్లాడితే ఎలా టార్గెట్ చేస్తారో అన్న భయమే ప్రధాన కారణం

ఏం మాట్లాడితే ఎలా టార్గెట్ చేస్తారో అన్న భయమే ప్రధాన కారణం

శాసనసభ సమావేశాల్లో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలా మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. శాసనసభలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలోని కొందరు టిడిపి ఎమ్మెల్యేలు, విశాఖ నుండి ఒక ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబుకు ఇబ్బంది

టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబుకు ఇబ్బంది

ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు బాసటగా ఎమ్మెల్యేల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చాలా మంది ఎమ్మెల్యేలు సభలో తమ గొంతును వినిపించలేదు. ఏదేమైనా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా మంది టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

English summary
Only the three TDP MLAs have been supporting and attcking at the YCP in assembly . Only three MLAs - AchteNaidu, Nimmala Ramanaidu and Gorantla Buchayya Chaudhary - are fighting with the ruling party. Senior leaders like Payyavula Keshav and Karanam Balaram are MLAs in TDP. There are aggressive leaders like Velagapudi Ramakrishna and Nandamuri Balakrishna . But does not dare to criticize the YCP.This causes a big debate in the ap politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X