• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్వైన్ ఫ్లూకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి: ఇంట్లో ఉండాలి.. టీవీ చూడాలి!

By Srinivas
|

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ భయాందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజే 139 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి ఫ్లూ ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు వైద్యులు ఉన్నారు.

స్వైన్ ఫ్లూకు ఉచిత చికిత్స ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. చల్లదనం తగ్గితే ఫ్లూ తగ్గుతుందని చెప్పారు. స్వైన్ ఫ్లూ సోకిన వారికి చికిత్సను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 Free treatment for swine flu

స్వైన్ ఫ్లూకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

స్వైన్‌ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకుతుంది. తుమ్ము, దగ్గు స్రావాల ద్వారా ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకినవారికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు చేసి ముక్కు కారిపోవడం వంటి లక్షణాలు కనపడతాయి.

ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వణుకు, అలసట బాధిస్తాయి. చాలామందికి వాంతులు, విరేచనాల వంటివి కూడా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనపడిన 36 గంటల్లో టామిఫ్లు, రెలెంజా వంటి యాంటీవైరల్‌ మందులు వాడితే చాలావరకూ ముప్పు తప్పినట్టే.

స్వైన్ ఫ్లూ లక్షణాలు కనపడగానే వైద్యులను సంప్రదించాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలున్నవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు కర్చీఫ్‌గానీ, మెడికేటెడ్‌ మాస్క్‌గానీ అడ్డు పెట్టుకోండి.

రెండూ అందుబాటులో లేనప్పుడు అరచెయ్యి అడ్డం పెట్టుకుని కాకుండా మోచేతి మడతను నోరు, ముక్కు వద్ద అడ్డుపెట్టుకొని లోపలివైపునకు తుమ్మాలి/దగ్గాలి.

అలా కాకుండా అరచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మినా, దగ్గినా ఆ తర్వాత మీరు ఏ వస్తువును పట్టుకుంటే ఆ వస్తువు పైకి వైరస్‌ చేరుతుంది. తర్వాత, మీ ఇంట్లో వాళ్లు ఎవరు ఆ వస్తువును ముట్టుకుని తమ ముక్కు, నోరు దగ్గర ఆ చేతిని పెట్టుకుంటే వారికీ ఆ వైరస్‌ సోకుతుంది.

ఒకవేళ పొరబాటున అరచేతిని అడ్డుపెట్టుకుని తుమ్మినా దగ్గినా వెంటనే చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వవద్దు. సిటీ బస్సులు, రైళ్లల్లో సర్జికల్‌ మాస్కులు ధరించి మాత్రమే ఎక్కాలి.

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంట్లో ఉండండి.. టీవీ చూడండి...

స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే.. ఇంట్లోనే ఉండాలని, టీవీ చూస్తూ గడపాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉండటం, టీవీ చూడటం వంటి తేలికైన పద్ధతులు ఫ్లూను అరికట్టేందుకు బాగా తోడ్పడినట్లుగా తాజా అధ్యయనంలో బయటపడింది.

తరుచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఇతరులను తాకకుండా ఉండటం వంటి మందులతో నిమిత్తం లేని చర్యలతో జబ్బులు వ్యాపించకుండా చూసుకోవచ్చునని, ఇవి ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ జబ్బుల వ్యాప్తిని తగ్గించడంలో కీలకపాత్ర పోషించగలవని తాజా అధ్యయనం పేర్కొంది.

ముఖ్యంగా టీకా పరిమితంగా ఉండటం లేదా టీకా అందుబాటులో లేని సమయాల్లో ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపింది. ఫ్లూ తీవ్రంగా విజృంభించిన సమయాల్లో బడులను, వినోద వేదికలను, బహిరంగ కార్యక్రమాలను ప్రయివేటుగా గానీ విధాన రూపంలో గాన మూసివేయడం మరింత మెరుగైనవిగా తేల్చారు.

English summary
Irrigation Minister Harish Rao said medicine and treatment would be extended free of cost for those affected by swine flu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X