హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేద్ద ఫ్రెండ్షిప్ బ్యాండ్: స్నేహితుల సంబరాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. యువత సందడి చేయగా.. చిన్నారులు కేరింతలు కొట్టారు. ఫ్రెండ్స్ షిప్‌బ్యాండ్లను కట్టుకుని తమ స్నేహభావాన్ని చాటుకున్నారు. మధుర జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ అది కలకాలం నిలవాలని కోరుకున్నారు.

నగరంలోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా పారా మెడికల్ అండ్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పొడవైన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను తయారు చేసి ప్రదర్శించారు. ఇక్కడ జరిగిన వేడుకలకు ఉపముఖ్యమంత్రి టి రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహ బంధం ఎంతో మధురమైందని అన్నారు.

దాదాపు 4 కిలో మీటర్ల పొడవైన ఫ్రెండ్షిప్ బ్యాండ్ రూపుదిద్దుకోవడంలో డిప్యూటీ సిఎం రాజయ్య కూడా భాగస్వామి అయ్యారు. కాగా, ప్రపంచంలో అతిపెద్ద ఫ్రెండ్షిప్ బ్యాండ్‌గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు అమ్మ రాజశేఖర్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు రావు, కిషన్, తెలంగాణా పారామెడికల్ అండ్ నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

స్నేహితుల రోజు

స్నేహితుల రోజు

స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. యువత సందడి చేయగా.. చిన్నారులు కేరింతలు కొట్టారు.

స్నేహితుల రోజు

స్నేహితుల రోజు

నెక్లెస్ రోడ్డులో తెలంగాణా పారా మెడికల్ అండ్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పొడవైన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను తయారు చేసి ప్రదర్శించారు. ఇక్కడ జరిగిన వేడుకలకు ఉపముఖ్యమంత్రి టి రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్నేహితుల రోజు

స్నేహితుల రోజు

ఫ్రెండ్స్ షిప్‌బ్యాండ్లను కట్టుకుని తమ స్నేహభావాన్ని చాటుకున్నారు. మధుర జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ అది కలకాలం నిలవాలని కోరుకున్నారు.

స్నేహితుల రోజు

స్నేహితుల రోజు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహ బంధం ఎంతో మధురమైందని అన్నారు. దాదాపు 4 కిలో మీటర్ల పొడవైన ఫ్రెండ్షిప్ బ్యాండ్ రూపుదిద్దుకోవడంలో డిప్యూటీ సిఎం రాజయ్య కూడా భాగస్వామి అయ్యారు.

English summary

 Friendship day celebration at necklace road in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X