హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణా నుండి ఏపీకి.. ఆర్టీసీ కార్గో బస్సులో అక్రమ మద్యం.. షాక్ అయిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా ఆగటం లేదు . ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నా కారణంగా, ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణా సాగుతుందని మద్యం ధరలను తగ్గించినా ఫలితం లేకుండా పోతుంది. తెలంగాణ నుండి ఏపీకి మద్యం అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా అక్రమార్కులు వివిధ మార్గాలలో దందా చేస్తున్నారు. మద్యం మాఫియా చివరకు ఆర్టీసీ బస్సులను కూడా వదలటం లేదు .

అమరావతిలో అక్రమ మద్యం .. వాటర్ ట్యాంకులో 10వేల బాటిళ్ళు.. తెలంగాణా నుండి కొరియర్ లోఅమరావతిలో అక్రమ మద్యం .. వాటర్ ట్యాంకులో 10వేల బాటిళ్ళు.. తెలంగాణా నుండి కొరియర్ లో

ఎంత నిఘా ఉన్నా సరిహద్దులు దాటుతున్న అక్రమ మద్యం

ఎంత నిఘా ఉన్నా సరిహద్దులు దాటుతున్న అక్రమ మద్యం


బస్సుల్లో, కార్లలో ,కొరియర్ లో, టూవీలర్ ల మీద మద్యం అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించిన పోలీసులు ఎక్కడికక్కడ మద్యం మాఫియాకు చెక్ పెడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ అధీన సంస్థలలోని వాహనాలలో కూడా మద్యం రవాణా అవుతుంది అంటే ఈ దందా ఎంత పెద్ద ఎత్తున సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు .ఎస్ఈబీ ,పోలీసులు ఎంత గట్టిగా నిఘా పెట్టినా అక్రమ మద్యం మాత్రం సరిహద్దులు దాటుతూనే ఉంది. తాజాగా ఓ ఆర్టిసి పార్సిల్ బస్సులో అక్రమ మద్యం పట్టుబడింది.

బెంజ్ సర్కిల్ లో ఆర్టీసీ పార్సిల్ బస్సులో అక్రమ మద్యం గుర్తించిన పోలీసులు

బెంజ్ సర్కిల్ లో ఆర్టీసీ పార్సిల్ బస్సులో అక్రమ మద్యం గుర్తించిన పోలీసులు

హైదరాబాద్ నుండి కొవ్వూరు డిపోకు వెళుతున్న ఆర్టీసీ పార్సెల్ బస్సులో నుండి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద కార్టన్లను దించారు. అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఏపీ 29 జెడ్ 0408 ఆర్టీసీ పార్సిల్ బస్సులో మద్యం బాటిళ్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇది ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు కావటం గమనార్హం .తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2198 మద్యం బాటిళ్లను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు లిక్కర్ మాఫియా. వీరు విజయవాడ, ఏలూరుకు ఈ అక్రమ మద్యం రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

 ఏపీఎస్ ఆర్టీసీ .. కొవ్వూరు డిపో బస్సులోనే అక్రమ రవాణా

ఏపీఎస్ ఆర్టీసీ .. కొవ్వూరు డిపో బస్సులోనే అక్రమ రవాణా

బస్సు డ్రైవర్లు తోట నాగరాజు, గమిడి నాగరాజు, మెకానిక్ ఎం శ్రీనివాస్ రావు లతో పాటు మద్యం పార్సిల్ తీసుకుంటున్న విజయవాడకు చెందిన సుబ్రమణ్యం, అప్పలనాయుడులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఆర్టీసీ పార్సెల్ బస్సులో రవాణా అవుతున్న ఈ మద్యం విలువ 11.3 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సు ఏపీ కి సంబంధించిన బస్సు కావడం, అది కొవ్వూరు డిపో బస్సు కావడంతో డిపో మేనేజర్ కు సమాచారం అందించారు.

 డ్రైవర్ లు , వ్యాపారులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న పోలీసులు

డ్రైవర్ లు , వ్యాపారులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న పోలీసులు

వేరే డ్రైవర్ కు బస్సును అప్పగించి డిపోకు పంపించారు. ఆర్టీసీ బస్సులో అక్రమ మద్యం రవాణా విషయంలో పోలీసులు కొవ్వూరు డిపో ఆర్టీసీ అధికారులను, అరెస్ట్ చేసిన డ్రైవర్లను, పార్సిల్ తీసుకుంటున్న వ్యాపారులను తమదైన కోణంలో విచారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వస్తున్న వాహనాల మీద, పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీలు చేస్తున్నా పోలీసుల కళ్లుగప్పి అనుమానం రాకుండా లిక్కర్ మాఫియా మద్యం రవాణా చేస్తూనే ఉంది. ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ దందా సాగుతున్న తీరు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది .

English summary
Cartons were unloaded at Vijayawada Benz Circle from an RTC parcel bus going from Hyderabad to Kovvur depot. Police on suspicion of possession found liquor bottles in the AP29Z0408 RTC parcel bus. It is an APS RTC bus .The liquor mafia was found smuggling 2198 bottles of liquor from Telangana to Andhra Pradesh. Police found that they were transporting the liquor to Vijayawada and Eluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X