రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వోల్వోలో మంటలు: కళాశాల విద్యార్థులకు అస్వస్థత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fumes in Volvo Bus
రాజమండ్రి/హైదరాబాద్: వోల్వో బస్సులో పొగలు రావడంతో ప్రయాణీకులు పరుగులు పెట్టిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. హైదరాబాద్ నుండి కాకినాడకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండుకు చేరుకోగానే ఈ పొగలు వచ్చాయి.

దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయంతో బస్సులో నుండి బయటకు పరుగు తీశారు. దగ్గర్లోనే ఫైరింజన్లు ఉన్నాయి. సమాచారం అందటంతో ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. బస్సులోని యాసిడ్ డబ్బానే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. యాసిడ్ లీకేజీతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.

దంపతుల ఆత్మహత్య

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఆర్టీసి బస్టాండులో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు దంపతుల వివరాలు సేకరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

పుడ్ పాయిజన్.. 200 మందికి అస్వస్థత

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బోడుప్పల్‌లోని ఓ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా రెండు వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఫుజ్ పాయిజన్ జరిగింది. కళాశాల యాజమాన్యం దీనిని గోప్యంగా ఉంచింది. తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
Fumes came out from Hyderabad - Kakinada Volvo Bus in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X