వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ టీటీడీ శ్రీవారి ఆలయంలో గోల్‌మాల్..!! 4 కోట్ల మేర అక్రమాలు: ఉన్నతాధికారిపైన ఆరోపణలు..!!

|
Google Oneindia TeluguNews

శ్రీవారి పేరుతో అక్రమాలకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ గోల్ మాల్ లో స్వయంగా ఒక ముఖ్య అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది. దాదాపు నాలుగు కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్ల ప్రాధమిక అంచనా. దీని కోసం గతంలోనే విజిలెన్స్ విచారణ ప్రారంభించగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యంతో విచారణ నిలిచపోయిందని చెబుతున్నారు. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో పని చేస్తున్న టీటీడీ అధికారి పైన టీటీడీ ఈవో సింఘాల్ వేటు వేసారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి వచ్చిన ఫిర్యాదు మేరకు తిరిగి ఇప్పుడు విచారణ ప్రారంభం అయింది. అయితే, ప్రస్తుతం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కేంద్రంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్ అడ్వయిజరీ కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు సమాచారం.

ఢిల్లీలో శ్రీవారి పేరుతో అవినీతి..

ఢిల్లీలో శ్రీవారి పేరుతో అవినీతి..

దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీటీడీ నిధుల విషయంలో గోల్ మాల్ జరిగిందని..అక్రమాలు..అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుల పైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాధమికంగా దాదాపుగా రూ. 4 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు నిర్ధారించినట్లు సమాచారం. నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల పేరుతో చందాలు స్వీకరించారని ఫిర్యాదు అందింది. అంతే కాకుండా రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు అందినట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఒక సాధారణ భక్తుడు ఆధారాలతో సహా టీటీడీకి ఫిర్యాదు చేసారు. అయితే, దీని పైన అప్పట్లోనే విచారణ ప్రారంభించగా.. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యంతో విచారణ నిలిచిపోయింది. దీంతో..అదే భక్తుడు తిరిగి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి ఫిర్యాదు చేసారు. దీంతో..తిరిగి దీనిని విజిలెన్స్ విభాగానికి విచారణ కోసం ఆదేశించింది.

ఏపీ భవన్ లో అందని సహకారం..

ఏపీ భవన్ లో అందని సహకారం..

ఆరోపణల ఆధారంగా విచారణ సాగించేందుకు అక్కడకు వెళ్లటానికి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది వెనుకడుగు వేస్తున్నారు. అసలు అక్కడ సిబ్బంది తమకు సహకరించటం లేదని వారు ఉన్నతాధికారులకు నివేదించారు. అంతర్గతంగా ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రెసిడెంట్ కమీషనర్ ఆదేశాల మేరకే తాము వ్యవహరించామని సమాధానం వస్తుందంటూ అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీంతో.. రెండ్రోజులుగా ఢిల్లీలోని ఏఈఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీలు కొనసాగుతున్నాయి. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో సింఘాల్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవటంతో
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సాధారణంగా రెసిడెంట్ కమిషనర్ కు మాత్రమే అక్కడ చెక్ పవర్ ఉంటుంది. బిల్లులకు సంబంధించిన చెక్ ఇచ్చే సమయంలోనే పూర్తి వివరాలు..ఖర్చులు..బిల్లులు చూసిన తరువాత చెక్ మీద సంతకం చేస్తారు.

రెసిడెంట్ కమిషనర్ తప్పించుకొనే ప్రయత్నం

రెసిడెంట్ కమిషనర్ తప్పించుకొనే ప్రయత్నం

అయితే, తన వద్ద పని చేసే సిబ్బంది మీద నమ్మకంతో చెక్ లు జారీ చేసామని చెబుతూ రెసిడెంట్ కమిషనర్ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని..టీటీడీ ఈవోకు రహస్యంగా ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని నకిలీ బిల్లులను అధికారులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. శ్రీవారి ఆలయం..భక్తులకు సంబంధించిన అంశం కావటంతో..దీని పైన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..విజయ సాయి రెడ్డి విచారణ తీరు పైన ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా వదలద్దని ప్రభుత్వం ఆదేశించినట్లుగా సమాచారం.

English summary
Funds misused allegations in TTD Delhi Balaji temple by local advisory committee. Vigilence officers started investigations on this complaints. Govt concentrated on This issue seriously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X