అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి ప్రవాహం: మిగతా ప్రాంతాలకు గండి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధులు మళ్లిస్తుండడంతో ఇతర ప్రాంతాలు వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. రాజధాని అమరావతిలో తాజాగా ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్తు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది.

దాని ప్రభావం ఇతర ప్రాంతాలపై పడేట్లు ఉంది. మిగిలిన ప్రాంతాలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమానంగా ఖర్చు చేయాల్సిన నిధులను ఒక్క రాజధాని ప్రాంతానికే ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర ప్రాంతాలకు తీరని నష్టం కలిగిస్తు్నాయి.
అమరావతి చుట్టూ మూడు 400 కేవీ ఉప కేంద్రాలను నిర్మించాలని, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ ఉపకేంద్రాలు, భూగర్భ విద్యుత కేబుళ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

రాయలసీమలాంటి కరువు జిల్లాల్లో విద్యుత్తు వ్యవస్థ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు సైతం ఇప్పుడు అమరావతికి వెళ్లిపోతున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం సారాంశం. దీంతో రాయలసీమ ప్రాంతంలో రానున్న రోజుల్లో విద్యుత సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Funds will be diverted to Amaravati will hamper other areas

మీడియా కథనాల ప్రకారం - భూగర్భ విద్యుత కేబుళ్లు, మూడు 400 కేవీ ఉప కేంద్రాల నిర్మాణం, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ ఉపకేంద్రాల కోసం రూ.3 వేల కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని ట్రాన్సకో అంచనా వేసినట్లు తెలిసింది. రాష్ట్రం మొత్తంలో సౌర, పవన విద్యుత రంగాలను అభివృద్ధి చేయడానికి రూ.3150 కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిధుల్లో రూ.2000 కోట్లకుపైగా కేవలం రాజధాని ప్రాంతంలోనే ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని ప్రాంతంలో దాదాపు రూ.6 వేల కోట్లను కేవలం విద్యుత్తు కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. నిధుల సమీకరణ ద్వారా ఈ మొత్తాన్ని కూడబెట్టడం కుదరకపోవడంతో అప్పుగా తీసుకుంటున్న మొత్తం నుంచి కూడా రూ.2 వేల కోట్లను రాజధానికి మళ్లించాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు అభివృద్ధికి గండికొడుతోంది.

అప్పుగా తీసుకోనున్న రూ.3,150 కోట్లలో రూ.2,085 కోట్లను గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నుంచి, 1,289 కోట్లను జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి తీసుకోనున్నారు. మరో రూ.259 కోట్లను జెనకో భరించనుంది. రూ.515 కోట్లను కేంద్రం గ్రాంటుగా ఇవ్వనుంది.

ఆ మొత్తాన్ని రాజధాని కోసమే ఖర్చు చేస్తుండడంతో మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

English summary
The Andhra Pradesh government decission to divert funds to Amaravati may hamper the development of other areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X