హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బియాస్ విషాదం: జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృతి చెందిన విద్యార్థి జగదీశ్ మృతదేహాన్ని శుక్రవారం నగరంలోని మైసమ్మ బస్తీకి తీసుకొచ్చారు. శుక్రవారం అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన జగదీష్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. ఎంతో ఆనందంగా విహార యాత్రకు వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా రావడంతో వారు తీవ్రంగా విలపించారు.

హైదరాబాద్ శివారులోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న జగదీశ్(20) జూన్ 3న ఇండస్ట్రీయల్ టూర్‌లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. జూన్ 8న బియాస్ నదిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఫొటోలు దిగేందుకు వెళ్లిన జగదీష్ తన తోటి 24మంది విద్యార్థులతోపాటు గల్లంతయ్యాడు.

కాగా, అతని మృతదేహం గురువారం లభ్యం కావడంతో.. శుక్రవారం నగరానికి తీసుకొచ్చారు. రహ్మత్ నగర్ డివిజన్‌లోని మైసమ్మ బస్తీలో నివాసముంటున్న భార్గవి, మల్లేష్ దంపతులకు జగదీష్ రెండో కుమారుడు. పెద్ద కుమారుడు మహేష్.

జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. ఎంపి ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టిఆర్ఎస్ నాయకులు మురళీగౌడ్, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పోరేటర్ బండపల్లి చంద్రమ్మ, బిజెపి నాయకులు సత్యనారాయణ, ఇతర నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు.

జగదీష్(ఫైల్)

జగదీష్(ఫైల్)

హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మృతి చెందిన విద్యార్థి జగదీశ్ మృతదేహాన్ని శుక్రవారం నగరంలోని మైసమ్మ బస్తీకి తీసుకొచ్చారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

శుక్రవారం జగదీష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చూసిన జగదీష్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

ఎంతో ఆనందంగా విహార యాత్రకు వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా రావడంతో జగదీష్ తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు, బంధువులు, స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్ శివారులోని విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న జగదీశ్(20) జూన్ 3న ఇండస్ట్రీయల్ టూర్‌లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

జూన్ 8న బియాస్ నదిలో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఫొటోలు దిగేందుకు వెళ్లిన జగదీష్ తన తోటి 24మంది విద్యార్థులతోపాటు గల్లంతయ్యాడు.

కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

ఎంపి ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టిఆర్ఎస్ నాయకులు మురళీగౌడ్, ఎంఐఎం నాయకులు నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కార్పోరేటర్ బండపల్లి చంద్రమ్మ, బిజెపి నాయకులు సత్యనారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

English summary

 Funerals of Jagadeesh Mudiraj at Yousufguda in Hyderabad on Friday, who died in beas river incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X