వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముద్రగడ ఆందోళనలకు భోజనాలు సమకూర్చేది ఆ మంత్రే, ఎందుకంటే?

కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం తరచూ నిర్వహించే ఆందోళనలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులను సృష్టిస్తున్నాడు. అయితే ముద్రగడ నిర్వహించే కార్యక్రమాలకు హజరయ్యేవారికి ఏపీ డిప్యూటీ స

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం తరచూ నిర్వహించే ఆందోళనలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులను సృష్టిస్తున్నాడు. అయితే ముద్రగడ నిర్వహించే కార్యక్రమాలకు హజరయ్యేవారికి ఏపీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చిన్నరాజప్ప భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ముద్రగడ అంటేనే నిప్పులు చెరిగే చిన్నరాజప్ప భోజనాలు పెట్టడం ఏమిటనేది విచిత్రంగా ఉంది కదూ.ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

ఏపీలో కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం తరచూ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. ముద్రగడ ఆందోళనలతో ఏపీ ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Funny conversation between Nimmakayala Chinna Rajappa and Journalists

తునిలో కాపుగర్జన పేరుతో ముద్రగడ ఆందోళనలు నిర్వహించారు. అంతేకాదు ఆమరణనిరహరదీక్ష చేపట్టారు. పురుగులమందు డబ్బా పట్టుకొని కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే నిరాహరదీక్షకు దిగారు.

అయితే ఈ ఘటనను కవరేజీ చేసేందుకు విజయవాడ, హైద్రాబాద్ ‌నుండి మీడియా ప్రతినిధులు వెళ్ళారు. అయితే అక్కడ భోజనాలు దొరకకపోవడంతో మీడియాతో సన్నిహితంగా ఉండే హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పకు మీడియా మిత్రులు ఫోన్ చేశారు. ఆయన అప్పటికప్పుడు వందమందికి భోజనాలను ఏర్పాటు చేశారు.

ఇదే తరహలో ఇప్పటికి మూడు దఫాలు ఆయన జర్నలిస్టులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. ఈ విషయాన్ని సచివాలయంలో ఆయన జర్నలిస్టులకు చెప్పి అందరినీ నవ్వించారు. ముద్రగడ పద్మనాభం మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు కదా, మీకు మరోసారి భోజనాలు ఏర్పాటు చేయాలని మా వాళ్ళను పురమాయించాను అంటూ చిన్నరాజప్ప మీడియా ప్రతినిధులకు చెప్పారు.

గతంలో ఓసారి అప్పటికప్పుడు ఫోన్‌చేసి వరుపుల రాజాకు చెప్పి భోజనాలు ఏర్పాటు చేయించాను. మీతో పాటు వెయ్యి మంది పోలీసులకు కూడ నేనే భోజనాలు ఏర్పాటుచేయిస్తున్నానని ఆయన చెప్పారు. ఇందుకోసం ఓ కళ్యాణ మండపాన్నే బుక్ చేశాను అంటూ ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా యాసలో ఆయన చెప్పిన మాటలకు జర్నలిస్టులు నవ్వారు.వారితో పాటు చిన్నరాజప్ప కూడ నవ్వారు. మంత్రి ఇంటికి వెళ్ళినవారిని భోజనం చేయకుండా బయటకు పంపరు. ఉదయమో, సాయంత్రమో వెళ్తే టీ, స్నాక్స్ ఇస్తారు.

English summary
Funny conversation between Ap deputy chief minister Nimmakayala Chinna Rajappa and Journalists on Thursday at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X