వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పార్టీకి గాదె: జెసి, వీరశివాల మధ్య ఆసక్తికర చర్చ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో కొత్త పార్టీ పెడితే దానిని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి లీడ్ చేస్తారని కాంగ్రెసు పార్టీ కమలాపురం సీనియర్ శాసన సభ్యుడు వీరశివా రెడ్డి సోమవారం వ్యాఖ్యానించారు. సోమవారం సిఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రులు గాదె వెంకట రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, వీరశివా రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సాగింది.

గాదెను సీమాంధ్రలో పెట్టబోయే కొత్త పార్టీకి నాయకుడిగా చేస్తామని, అభ్యంతరమా అని జెసిని వీరశివా రెడ్డి ప్రశ్నించారు. అందుకు జెసి స్పందిస్తూ.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయనను నాయకుడిగా చేసుకోవాలని చెప్పారు. దీనికి గాదె ఏమీ మాట్లాడకుంటానే నవ్వుతూ వెళ్లిపోయారట.

మరోవైపు, కాంగ్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనంపై సందర్భం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేరుగా చెప్పారు. ఈ విషయంపై ఇప్పుడు చర్చ, ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్య నేతలకు సూచించారట.

సోమవారం తెలంగాణ భవన్‌లో కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కెసిఆర్ మాట్లాడారు. విలీనం అంశం తానొక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, అందరం కలిసి తీసుకునేదని చెప్పారట.

English summary
Kamalapuram Congress MLA Veerasiva Reddy on Monday told former minister JC Diwakar Reddy that they will elect Gade Venkat Reddy to lead new party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X