వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నోట్ల రద్దుపై జగన్ ఎందుకు నోరు విప్పట్లేదు, ఆ జిమ్మిక్కులు విజయ సాయికే తెలుసు'

రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదని, ఎందుకో చెప్పాలని టిడిపి ప్రశ్నించింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదని, ఎందుకో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం ప్రశ్నించారు.

'నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత జగన్ పరిస్థితి ఇది, అజ్ఞాతంలోకి' 'నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత జగన్ పరిస్థితి ఇది, అజ్ఞాతంలోకి'

పెద్ద నోట్ల రద్దు పైన దేశంలో అన్ని పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాయని చెప్పారు. కానీ వైసీపీ మాత్రం నోరు విప్పలేదన్నారు. అవినీతి రూపు మాపే విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం లేదన్నారు.

ప్రజల నోట్ల రద్దు కష్టాలను కేంద్రం పరిష్కరించక పోవడం బాధాకరమని కేంద్రం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికి అప్పుడు కేంద్రంతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

Gali and Dokka fire at YS Jagan

బుగ్గన చెప్పింది అబద్దం: గాలి

హెరిటేజ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పింది అవాస్తవమని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆయన అనవసర ఆరోపణలు చేశారన్నారు. హెరిటేజ్ డైరీలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు మాత్రమే కొన్నదని, హెరిటేజ్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందన్నారు.

సూటు కేసు కంపెనీలు ఏర్పాటు చేసిన ఘనత వైసిపి అధినేత జగన్‌దే అన్నారు. జగన్ కంపెనీల్లో షేర్లు పెట్టిన వాళ్లు జైళ్లకు వెళ్లారని చెప్పారు. షేర్లు తారుమారు చేసే జిమ్మిక్కులు విజయ సాయి రెడ్డికే తెలుసునని ఆరోపించారు. చంద్రబాబు పైన బ్లాక్ మనీ ఆరోపణలు చేసిన వైసిపి నిరూపించాలని డిమాండ్ చేశారు.

రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదని, ఎందుకో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం ప్రశ్నించారు.

English summary
TDP leader Gali Muddukrishnama Naidu and Dokka Manikya Vara Prasad fired at YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X