చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మస్తాన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరణ, గాలి సరస్వతమ్మ ఎన్నిక ఏకగ్రీవం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికకు మార్గం సుగమమైంది. అయితే ఈ విషయాన్ని ఈ నెల 7వ తేదిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది.

Recommended Video

గాలి ఫ్యామిలీకే దక్కిన MLC టిక్కెట్

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండు మాసాల క్రితం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో చిత్తూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో టిడిపి తరపున గాలి సతీమణి సరస్వతమ్మ నామినేషన్ దాఖలు చేశారు.

Gali saraswatamma elected unanimously from Chittoor local bodies mlc segment

గాలి సతీమణికి మద్దతుగా రాష్ట్రంలో కొంత కాలంగా కొనసాగుతున్న సంప్రదాయాల ప్రకారంగా విపక్షాలు
ఈ స్థానంలో పోటీకి నామినేషన్ దాఖలు చేయలేదు. అయితే మస్తాన్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. కానీ, శుక్రవారం నాడు మస్తాన్ రెడ్డి కూడ నామినేషన్ ఉపసంహరించుకొన్నారు.

ఈ స్థానానికి బరిలో ఉన్న వారిలో టిడిపి అభ్యర్ధి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మ ఒక్కరే.దీంతో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నెల 7వ తేదిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

English summary
Mastan Reddy withdrawal his nomination on Friday. Mastan reddy filed nomination for chittoor local bodies mlc seat.after mastan reddy withdrawn nomination Tdp candidate Gali saraswathamma unanimously elected from this segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X