హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాయా బజారా?: గల్లా అరుణ అసహనం, వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Aruna KUmari
హైదరాబాద్: శాసన సభ జరిగిన తీరుపై మంత్రి గల్లా అరుణ కుమారి సోమవారం అసహనం వ్యక్తం చేయడంతో పాటు డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కతో వాగ్వాదానికి దిగారు. ఇది మయసభానా లేక మాయాబజారా.. అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా వేసే సమయంలో స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలేమీ తమకు అర్ధం కావడంలేదని, సభను వాయిదా వేశారో లేక నడుపుతున్నారో తెలియడం లేదన్నారు.

ఈ విషయం తాము డిప్యూటీ స్పీకర్‌ను అడుగుతామన్నారు. మల్లుభట్టిని అడిగేందుకు గల్లా అరుణ కుమారి, ఇతర మహిళా ఎమ్మెల్యేలు ఆయన ఛాంబర్‌కు బయలుదేరారు. కారిడార్‌లో డిప్యూటీ స్పీకర్ కనిపించడంతో మయసభానా లేక మాయాబజారా..? శాసనసభాలా లేదన్నారు.

అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే లాభపడతాయని, తెలంగాణ ఇచ్చినా ఏ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఒరిగేది ఏమీ లేదన్నారు. సీమాంధ్రలో తమ వంతు పోరాటం చేస్తున్నామన్నారు.

అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన తీరు చాలా బాధాకరమని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రామారావు, రామకృష్ణలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేయడానికి స్పీకర్ చాంబరుకు వెళ్లామని, అక్కడ కళ్లు తిరిగి, మెట్లపై కూర్చున్న తమను భట్టి విక్రమార్క తొక్కుకుంటూ సభలోకి వెళ్లారని, మార్షల్స్ కూడా తన్నుతూ లాక్కొని పోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Seemandhra Congress senior leader and Minister Galla Aruna KUmari on Monday fired at Deputy Speaker Mallu Bhatti Vikramarka for Assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X