వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రగిరి నుండి టిడిపి అభ్యర్థిగా గల్లా, క్యాడర్ అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
హైదరాబాద్: ఇటీవలె తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారికి చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటును ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం ఆమె తన కొడుకు గల్లా జయదేవ్‌తో కలిసి సైకిల్ ఎక్కారు. జయదేవ్‌కు గుంటూరు లోకసభ టికెట్‌ను ముందే ఖరారు చేశారు. ఆమె చేరిన తర్వాత ఆ నియోజకవర్గ నేతలతో పార్టీ టిడిపి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు.

అక్కడ ఆమె సరైన అభ్యర్థి అవుతారని వారంతా చెప్పడంతో ఆమెనే అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ప్రస్తుతం అరుణ ఆ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల కోసం పని చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సీటుకు పార్టీ అభ్యర్థిగా వెంకటేశ్‌ను ఖరారు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్‌ను సుభాష్ రెడ్డికి ఖరారు చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభ్యర్థిగా సోయం బాబూరావును ఎంపిక చేశారు.

ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యే జి నగేష్ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లడంతో గతంలో ఆ నియోజకవర్గంలో తెరాస తరపున గెలిచిన బాబూరావును పార్టీలోకి తీసుకువచ్చి అభ్యర్థిగా నిశ్చయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఇవ్వనున్నారు. కొట్టు ఇక్కడ చంద్రబాబును కలిసి ఆయన సమక్షంలో టిడిపిలో చేరారు.

గల్లాపై అసంతృప్తి

మరోవైపు గల్లా అరుణ కుమారి పట్ల చిత్తూరు, ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గ టిడిపి క్యాడర్ అసంతృప్తితో ఉందని అంటున్నారు. ఇన్నాళ్లు తమకు వ్యతిరేకంగా పని చేసిన గల్లా అరుణ పార్టీలో చేరడం, ఆమెను గెలిపించేందుకు తాము కృషి చేయాల్సి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట.

ఆమె అధికారంలో ఉన్నప్పుడు తమ పైన కేసులు పెట్టి వేధించారని గుర్తు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గల్లా బిజీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించి, తన సత్తా చూపించాలని ఆమె భావిస్తున్నారు. అయితే, ఆమె తన ప్రచారంలో టిడిపి క్యాడర్ కంటే తన వర్గం వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.

English summary
Former Minister Galla Aruna Kumari will contest from Chandragiri constituency on Telugudesam Party ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X