వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘టీడీపీపై బీజేపీ కుట్ర! కాంగ్రెస్‌కు పట్టిన గతే?: జగన్ పార్టీని నమ్మడమెలా?’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్‌ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటికి వచ్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Recommended Video

అతి విశ్వాసం వల్లనే బీజేపీ ఓటమి : మోదీకి దీటుగా ‘మహా’కూటమి సన్నాహాలు

ఈ నేపథ్యంలో శుక్రవారం గ‌ల్లా జ‌య‌దేవ్, రామ్మోహన్నాయుడు ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ రాజ‌కీయ కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టీడీపీపై బీజేపీ కుట్ర

టీడీపీపై బీజేపీ కుట్ర

త‌మిళ‌నాడులో బీజేపీ చిన్న పార్టీల‌ను ప్రోత్స‌హించిందని, పెద్ద పార్టీల‌ మ‌ధ్య వివాదం సృష్టించింద‌ని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ బీజేపీ నేత‌లు అదే వ్యూహం అమ‌లుకు ప్ర‌య‌త్నిస్తున్నారని అన్నారు. ఏపీలో టీడీపీని బలహీనపర్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

దమ్ముందా? అవిశ్వాసంపై ఎందుకిలా?: టీడీపీ, వైసీపీలపై పవన్ ఆగ్రహం, ‘48గంటల డెడ్‌లైన్'దమ్ముందా? అవిశ్వాసంపై ఎందుకిలా?: టీడీపీ, వైసీపీలపై పవన్ ఆగ్రహం, ‘48గంటల డెడ్‌లైన్'

నీచ రాజకీయాలు

నీచ రాజకీయాలు

కేంద్ర ప్ర‌భుత్వంపై త‌మ‌కు విశ్వాసం పోయిందని, బీజేపీ నీచ రాజ‌కీయాలు ప్రారంభించిందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఎంత కష్ట‌ప‌డ‌యినా స‌రే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను సాధిస్తామ‌ని అన్నారు. తాము పెట్టిన అవిశ్వాసంపై ఆర్డర్ లేదని, సభలో గందగోళ పరిస్థితి నెలకొందని.. వాయిదా వేయడం సరికాదని అన్నారు. అవిశ్వాసంపై చర్చ చేపట్టకపోవడం ప్రజాస్వామ్యానికి మంచది కాదని అన్నారు. ఇంతకుముందు ఆర్డర్ లేకున్నా అనేక బిల్లులు ఆమోదింపజేసుకున్నారని అన్నారు.

‘పవన్! పన్నీరుసెల్వంలా?, అప్పుడు చిరుపై మనసుపారేసుకొని! కేసీఆర్‌కు ప్రశంస - బాబుకు విమర్శా?'‘పవన్! పన్నీరుసెల్వంలా?, అప్పుడు చిరుపై మనసుపారేసుకొని! కేసీఆర్‌కు ప్రశంస - బాబుకు విమర్శా?'

వైసీపీని నమ్మెదెలా?

వైసీపీని నమ్మెదెలా?

లోకసభలో అవిశ్వాసం ప్రవేశపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తమకు నమ్మకం లేకనే తాము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందని జయదేవ్ తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎప్పుడూ పీఎంఓ చుట్టూ తిరుగుతుంటారని.. ఇక ఆ పార్టీ అవిశ్వాసం పెడితే నమ్మెదెలా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ..

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకీ..

మరో ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రయోజనాల కోసమే తాము అవిశ్వాసం పెట్టామని అన్నారు. ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్త చర్చ జరగాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టినగతే బీజేపీకీ పడుతుందని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలను వంచించారు కాబట్టే అవిశ్వాసం పెట్టామని ఎంపీ తోట నర్సింహం అన్నారు.

చంద్రబాబు పవరెంటో..

చంద్రబాబు పవరెంటో..

ఎన్డీఏ నుంచి బయటికి రావడం, అవిశ్వాస తీర్మానంతో చంద్రబాబు పవరెంటో నరేంద్ర మోడీకి తెలుస్తుందని టీడీపీ నేత వీర శివారెడ్డి అన్నారు. గత ఎన్డీఏ పాలనలో వాజ్‌పాయి మిత్రధర్మం పాటిస్తే.. మోడీ మాత్రం మిత్ర ద్రోహం చేశారని మండిపడ్డారు.

English summary
TDP MPs Galla Jayadev and Rammohan naidu on Friday fired at BJP for state issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X