వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! మీ మౌనం దేనికి సంకేతం? అభిమానులను ప్రోత్సహిస్తున్నారా?: గల్లా జయదేవ్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారని ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.

తప్పుడు భాష

తప్పుడు భాష

‘పీకే(పవన్ కళ్యాణ్) గారూ.. మీపై వ్యక్తిగత విమర్శల దాడి జరిగిందని ఆరోపిస్తూ.. మీరు మీడియాపై దాడికి దిగారు. మీ అభిమానులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తప్పుడు భాష వాడుతున్నారు' అని గల్లా జయదేవ్ తెలిపారు.

ఏంటమ్మా! అప్పుడలా..ఇప్పుడిలానా??: కర్ణాటకలో పురంధేశ్వరికి షాకిచ్చిన తెలుగు రైతుఏంటమ్మా! అప్పుడలా..ఇప్పుడిలానా??: కర్ణాటకలో పురంధేశ్వరికి షాకిచ్చిన తెలుగు రైతు

పవన్.. మౌనం ఎందుకు?

అంతేగాక, ‘శరీరాకృతి గురించి మాట్లాడుతున్నారు. కుటుంబసభ్యులను ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో మీ మౌనం పరోక్షంగా దీనిని మీరు అగీకరిస్తున్నట్లు, ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపిస్తోంది' అని గల్లా ఘాటుగా స్పందించారు.

నా అనుచరులూ మీరు అలాగే ఉండండి..

అంతేగాక, తన అనుచరులు ఎవ్వరూ కూడా వ్యక్తిగత దాడులకు దిగవద్దని, బాడీ షేమింగ్‌కు పాల్పడవద్దని గల్లా జయదేవ్ కోరారు. వ్యక్తుల కుటుంబాలపై దూషణలు వద్దని, హింసకు చోటివ్వకూడదని.. ఇంతకుముందు కూడా ఇలా చేయలేదని, ఇకపై కూడా అదే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు.

వన్డే మ్యాచ్‌లా, ఛార్జింగ్ డౌన్!-ఫుల్‌ఛార్జీలో, మీరేం చేస్తున్నారు?: గల్లా, పవన్ మధ్య ట్వీట్ వార్వన్డే మ్యాచ్‌లా, ఛార్జింగ్ డౌన్!-ఫుల్‌ఛార్జీలో, మీరేం చేస్తున్నారు?: గల్లా, పవన్ మధ్య ట్వీట్ వార్

పవన్ విమర్శల నేపథ్యంలోనే..

పవన్ విమర్శల నేపథ్యంలోనే..

తన తల్లిపై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పలు మీడియా ఛానళ్లు ఆ వీడియోను పదే పదే చూపించడంతో సదరు మీడియా ఛానెళ్లు, వాటి అధినేతలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పవన్ అభిమానులు కూడా ఆయనపై విమర్శలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ స్పందించినట్లు తెలుస్తోంది.

English summary
Telugudesam MP Galla Jayadev takes on at Janasena President Pawan Kalyan for his fans comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X