సభలో ప్లకార్డు లొల్లి, గల్లాVsడికె: టిపై 4న జివోఎం భేటీ

ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినా సభ్యులు వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను మరో గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
చేతులు ముడుచుకోలేదు
తాము చేతులు ముడుచుకొని కూర్చోలేదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ కృష్ణా జిల్లా విజయవాడలో అన్నారు. తాము పార్లమెంటులో మరోసారి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
జివోఎం భేటీ
మరోవైపు ఫిబ్రవరి నాలుగో తేదిన మంత్రుల బృందం (జివోఎం) భేటీ కానుంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జివోఎం సభ్యులు 4న సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు. ఆరు ప్రధాన ప్రతిపాదనలను పరిశీలించనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications