వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో ప్లకార్డు లొల్లి, గల్లాVsడికె: టిపై 4న జివోఎం భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Vs DK Aruna in Assembly
హైదరాబాద్: శాసన సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం మొదటిసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో పరిస్థితి సద్దుమణగక పోవడంతో సభాపతి మరో గంటపాటు వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే ఇరు ప్రాంతాల ప్రతినిధులు జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్య ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలోని ప్లకార్డును తెలంగాణ ప్రాంత మంత్రి డికె అరుణ లాక్కున్నారు.

ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినా సభ్యులు వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను మరో గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

చేతులు ముడుచుకోలేదు

తాము చేతులు ముడుచుకొని కూర్చోలేదని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ కృష్ణా జిల్లా విజయవాడలో అన్నారు. తాము పార్లమెంటులో మరోసారి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.

జివోఎం భేటీ

మరోవైపు ఫిబ్రవరి నాలుగో తేదిన మంత్రుల బృందం (జివోఎం) భేటీ కానుంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జివోఎం సభ్యులు 4న సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు. ఆరు ప్రధాన ప్రతిపాదనలను పరిశీలించనున్నారని తెలుస్తోంది.

English summary
Telangana Minister DK Aruna on Wednesday grabbed placard from Seemandhra Minister Galla Aruna Kumari in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X