హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభా యాత్ర: నమో గణేశాయా, పూలవర్షం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నగరంలో గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర సందడిగా మారింది. జంటనగరాలు వినాయకుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి. వినాయక నిమజ్జనం చూసేందుకు వచ్చిన భక్తులతో ట్యాంక్‌బండ్‌ కోలాహలంగా మారింది. అక్కడి పరసర ప్రాంతాల్లో భక్తులతో కిక్కిరిసిపోయాయి.
వినాయకుల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ దగ్గర 40 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరంలో రేపు(మంగళవారం) ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి కావడానికి 12 గంటలు పడుతుందని భావిస్తున్నారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంతో కార్యక్రమం ముగుస్తుందని భావిస్తున్నారు.

జంటనగరాల్లో గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని, అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గణేష్‌ నిమజ్జనం పూర్తి చేస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు.

ఆటో బోల్తాతో ఒకరి మృతి

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్‌ శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. మొహంజాహీ మార్కెట్‌ వద్ద సోమవారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

హుస్మాన్‌గంజ్‌కు చెందిన రాజేష్‌ అనే వ్యక్తి తన షాపులో పెట్టిన వినాయకున్ని నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో మొహంజాహీ మార్కెట్‌ వద్ద సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటన సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయినప్పటికీ వెంటనే పోలీసులు క్లియర్‌ చేశారు.

ఏరియల్ సర్వే

ఏరియల్ సర్వే

వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని డిజిపి అనురాగ్ శర్మ, హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించారు.

హెలికాప్టర్ నుంచి ఇలా...

హెలికాప్టర్ నుంచి ఇలా...

హెలికాప్టర్ నుంచి గణేశుడి శోభాయాత్ర ఇలా కనిపించింది. హైదరాబాద్ నగరం జై గణేశా నినాదాలతో మారుమ్రోగింది.

బాలాపూర్ లడ్డూ...

బాలాపూర్ లడ్డూ...

బాలావూర్ లడ్డూకు విశేషమైన విశిష్టత ఉంది. దాన్ని దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ఈ ఏడాది ఆ లడ్డు 9.5 లక్షల రూపాయలు పలికింది.

బాలాపూర్ వినాయకుడు...

బాలాపూర్ వినాయకుడు...

బాలాపూర్ వినాయకుడు సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వినాయక్ సాగర్ సమీపానికి చేరుకుంది.

జాతీయత కూడా...

జాతీయత కూడా...

బాలాపూర్ గణేశుడి ఊరేగింపులో జాతీయ భావం కూడా ఉట్టిపడింది. ఓ బాలుడు ఇలా జాతీయ జెండాను ఎగురవేస్తూ..

గణేశుడి నిమజ్జనం..

గణేశుడి నిమజ్జనం..

సోమవారం ఉదయం గణేశుడి విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో ప్రారంభమైంది. రాత్రంతా అది కొనసాగుతుంది.

విచిత్రమైన ముఖాలతో...

విచిత్రమైన ముఖాలతో...

వినాయకుడి భక్తులు గణేశుడి నిమజ్జన కార్యక్రమంలో తమ కళాప్రదర్శనకు పని పెట్టారు. ఇలా తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు.

గణేశ్ మాస్క్‌లు....

గణేశ్ మాస్క్‌లు....

వినాయకుడి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులు, పిల్లలు ఇలా గణేశుడి మాస్క్‌లతో తమ భక్తిని చాటుకున్నారు.

పూలవర్ణం...

పూలవర్ణం...

వినాయక విగ్రహాల సందర్భంగా ఆకాశంపై నుంచి గణేశుడిపై మూడు క్వింటాళ్ల పూలవర్షం కురిపించారు. సాయంత్రం ఐదు గంటలకు నిమజ్జనం ఊపందుకుంది.

బహురూపాల గణేశుడు..

బహురూపాల గణేశుడు..

అత్యంత శోభాయమానంగా అలంకరించిన వినాయకుడి విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కు తరలి వచ్చాయి. వివిధ రూపాల గణేష విగ్రహాలు తరలి వచ్చాయి.

నిమజ్జనం వేగం...

నిమజ్జనం వేగం...

సోమవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతానికి పెద్ద యెత్తున వినాయకుడి విగ్రహాల నిమజ్జనం చాలా వరకు జరిగింది.

నరేంద్ర మోడీ హైలెట్...

నరేంద్ర మోడీ హైలెట్...

గణేశుడి శోభాయాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ పోస్టర్ ఇలా దర్శనమిచ్చింది. తెలంగాణ సిఎం ముఖ్యమంత్రి పోస్టర్ కూడా కనిపించింది.

కెసిఆర్ కారు...

కెసిఆర్ కారు...

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫొటోతో, పార్టీ సింబల్ కారు మీద వినాయకుడిని ఊరేగిస్తూ ఇలా..

English summary

 Nayani Narsimha Reddy, Hon’ble Home Minister of Telangana State, Aerial Survey on the immersion of Ganesh by Helicopter on 08.09.2014, DGP & other officials are also seen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X