కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంపాలని చూస్తున్నారు, ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను ఎన్‌కౌంటర్ చేస్తారేమోననే భయంగా ఉందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

మారిషస్ నుంచి తరలిస్తుండగా గంగిరెడ్డిని పోలీసులు పిస్టల్‌తో బెదిరించి భయపెట్టటంతో ప్రాణహాని లేదని మీడియాకు చెప్పారని తెలిపారు. దీనిపై ఇదివరకే గవర్నర్‌కు కూడా ఓ లేఖ రాశామని ఆమె చెప్పారు. తన భర్త గంగిరెడ్డికి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కక్షసాధింపుతోనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె పేర్కొన్నారు.

 ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

'నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చే మార్గంలో పిస్టల్‌తో బెదిరించారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే భార్య, పిల్లలను కూడా చూసుకోలేవంటూ భయపెట్టారు'. అందుకనే మొన్న మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రాణహానీ లేదని చెప్పారు. కానీ నేను జైలుకు వెళ్లి ఆయన్ను కలిస్తే తాను ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో వివరించారు. పిస్టల్‌తో బెదిరించారు. మిమ్మల్ని మళ్లీ చూస్తానో లేదోనన్న భయంతో అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ


అందుకే మీడియా ద్వారా గవర్నర్‌గారికి విజ్ఞప్తి చేసుకునేదేమిటంటే, మేం మీ దగ్గరకు వచ్చి లేఖ ఇచ్చేంత శక్తి కలిగిన వాళ్లం కాదు సార్. నా మాటలను మీరు పరిగణనలోకి తీసుకుని నా భర్తకు ఎలాంటి హానీ లేకుండా సురక్షితంగా ఉండేటట్లు చూడాలని కోరుతున్నాను. జైలులో ఆయనను ఏమన్నా చేస్తారన్న అనుమానాలు ఉండబట్టే నేను ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. జైలులో గానీ, కోర్టుకు తీసుకెళ్లే సమయంలో గానీ, ఆహారం ద్వారా గానీ దేనిద్వారా అయినా ఆయనకు హాని జరిగితే అందుకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలన్నారు.

 ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

అలిపిరి ఘటనలో 2003లో నా భర్తను ఇంటరాగేషన్ పేరుతో తీసుకెళ్లి చాలా హింసించారు. మానసికంగానే కాదు శారీరకంగానూ హింసించారు. ఇప్పుడు కూడా కస్టడీకి తీసుకునేటపుడు గానీ, వాయిదాలకు తీసుకెళ్లే మార్గమధ్యంలో గానీ ఎన్‌కౌంటర్ చేస్తారని భయంగా ఉంది. అలిపిరి ఘటనలో నా భర్త ప్రమేయమున్నదన్న వార్తలు అవాస్తవం. ఆనాటి చానళ్ల వార్తలు గానీ, పేపర్ల వార్తలు గానీ చూడండి. ఎక్కడా నా భర్త పేరు లేనేలేదు. మా ఆయన అంతటివాడు కాదు. కేవలం కక్ష సాధించడానికే ఈ కేసులు పెట్టారు. ఆనాడు చంద్రబాబు స్వయంగా కోర్టుకు వెళ్లి ఈయనెవరో తనకు తెలియదని చెప్పారని అన్నారు.

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ


డీజీపీ జేవీ రాముడుగారు గంగిరెడ్డిపై 28 కేసులున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఆయనపై రెండే కేసులున్నాయి. వాటిలో ఒక కేసులో శిక్ష అనుభవించారు. కానీ ఆయనను మారిషస్ నుంచి తీసుకురావడం కోసం రద్దయిపోయిన కేసులో ప్రత్యేకంగా జీవో జారీ చేసి అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఇవన్నీ కక్షపూరిత చర్యలు కావా.. అందుకనే మాకు అనుమానాలున్నాయి. ఆయన బెరైటిస్ ఎక్స్‌పోర్ట్ పర్మిషన్ల కోసం దుబాయి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దానివల్ల భయపడి ఆయన అక్కడ ఉండి ఉండవచ్చు కానీ పారిపోయే ఉద్దేశం ఆయనకు లేదు. ఆయనపై మోపిన కేసులకు ఆయనకు సంబంధం లేదన్నారు.

 ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ

ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత: గంగిరెడ్డి భార్య ఆరోపణ


మొదటి నుంచి మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 1992 నుంచి మాపై కక్షసాధిస్తున్నారు. 2003లోనూ, 2014లోనూ ఎన్నికల ముందు ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా తాతగారైన పెంచలరెడ్డిగారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1981 వరకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982లో మా బావగారైన బ్రహ్మానందరెడ్డిగారు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మండలాధ్యక్షుడిగా, డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కోడూరు తాలూకా పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. మా తండ్రిగారైన బాబుల్‌రెడ్డి పుల్లంపేట ప్రెసిడెంట్ కాగా, మా అమ్మగారు అనాసంద్రం ప్రెసిడెంట్. మాది పూర్తిగా రాజకీయ కుటుంబం. అందుకే టీడీపీ కావాలనే మాపై కక్షసాధిస్తున్నారు.

English summary
Red Sandalwood smuggler Gangireddy’s wife Malavika interacted with media to express her fear over her husband’s life. She alleged of a life threat for her husband from AP government as she came to known that her husband was threatened by police officials with a pistol while deporting to India from Mauritius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X