వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప సబ్ జైలులో గ్యాంగ్‌స్టర్ ఆత్మహత్య, ఎవరీ సునీల్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా సబ్ జైలులో గ్యాంగ్‌స్టర్ సునీల్ ఆత్మహత్య చేసుకొన్నారు. శుక్రవారం నాడు గ్యాంగ్ స్టర్ సనీల్ కడప సబ్ జైలులో కొంత కాలంగా సునీల్ కడప జిల్లా సబ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. రాయలసీమ జిల్లాలో పలు కేసులు సునీల్‌పై ఉన్నాయి.

రాయలసీమ జిల్లాల్లో సునీల్‌పై పలు కేసులు ఉన్నాయి. సుమారు 19 కేసులు, పీడీ యాక్టులను సునీల్‌పై నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో భాగంగా కర్నూల్ జిల్లా కోర్టు వాయిదాకు వెళ్ళి తిరిగి వస్తుండగా సునీల్ ‌ఈ ఏడాది మార్చి 27న పోలీసుల కళ్ళుగప్పి పారిపోయాడు.

Gangstar Sunil suicide in Kadapa sub jail

సునీల్ తప్పించుకుపోయి వెళ్ళడానికి పోలీసులు సహకరించారనే ఆరోపణలున్నాయి. బెంగుళూరులో తలదాచుకొన్న సునీల్ రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్‌ను కడప సబ్ జైలుకు తరలించారు.

కడప సబ్ జైలులో ఉన్న సునీల్‌ శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. సునీల్‌ అనతికాలంలోనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

అయితే పోలీసుల నుండి రెండు దఫాలు తప్పించుకొన్న సునీల్ చివరకు కడప జైలులోనే ఉరేసుకొని చనిపోయాడు. డబ్బుల కోసం కిడ్నాప్‌లు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు చేయడం సునీల్‌కు వెన్నతో పెట్టిన విద్య.

సునీల్ నేరచరిత్ర

రాయలసీమ జిల్లా పోలీసులకు చక్కలు చూపించిన గ్యాంగ్‌స్టర్ సునీల్ అత్యంత కడప సబ్ జైలులో ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన సునీల్ అతి తక్కువ కాలంలోనే గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. రాయలసీమ జిల్లాల్లో సునీల్‌పై పలు కేసులు నమోదయ్యాయి. పోలీసుల నుండి రెండు దఫాలు తప్పించుకొన్న సునీల్ చివరకు జైలులోనే శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.

సులభంగా డబ్బులు సంపాదించడం కోసం సునీల్ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఇంటర్, ఇంజనీరింగ్ విద్యార్ధులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. 2010 నుండి సునీల్‌పై రాయలసీమ జిల్లాల్లో పలు కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలోనే సుమారు 13 కేసులున్నాయి. రాయలసీమ జిల్లాల్లో సుమారు 19 కేసులున్నాయి. కృష్ణా జిల్లాలో కూడ ఓ కేసు సునీల్‌పై ఉంది.

విద్యార్థులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసిన సునీల్ వారికి డబ్బులు, అమ్మాయిలు, మద్యంతో ఆకర్షించేవాడని పోలీసులు చెబుతున్నారు.సునీల్ గ్యాంగ్‌లో సుమారు రెండు వందలకు పైగా సభ్యులున్నారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, మోసం చేయడం, ఆయుధాలు కలిగి ఉండడం వంటి కేసులున్నాయి.

రెండుసార్లు తప్పించుకొన్న సునీల్

2014లో ఒకసారి కడప సెంట్రల్‌ జైలులోకి వెళుతూ అనంతపురం నుంచి వచ్చిన ఎస్కార్టు పోలీసుల కళ్లు గప్పి పారిపోయి కృష్ణా జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. గత నెల 27న కర్నూలులో కోర్టు వాయిదాకు వెళ్లిన సునీల్‌కుమార్‌ను వాయిదాకు తీసుకెళ్లేందుకు కర్నూలు జిల్లా నుంచి ముగ్గురు ఏఆర్‌ పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. అక్కడి నుంచి వారిని మభ్యపెట్టి కడప బిల్టప్‌ జంక్షన్‌ వద్దకు రాగానే కేంద్ర కారాగారానికి వెళ్లకుండా దిగారు. అక్కడి నుండి సునీల్ తప్పించుకొన్నారు. బెంగుళూరులో ఉన్న సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప సబ్ జైలులో ఉన్న సునీల్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

English summary
Notorious gangster Sunil suicide in Kadapa sub jail on Friday.Sunil shifted to Kadapa sub jail two days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X