వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగుల ఎఫెక్ట్: వైసీపీకి షాక్, గోస్పాడుపై పట్టుకు ప్రతాప్‌రెడ్డి వ్యూహం

గోస్పాడు మండలంలో తన పట్టును నిరూపించుకొనేందుకు గంగుల ప్రతాప్‌రెడ్డి వ్యూహం.యాలూరులో తన అనుచరులను టిడిపిలో చేర్పించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరిన వెంటనే తన సత్తాను చూపేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలోని యాళ్ళూరులో వైసీపీకి చెందిన కార్యకర్తలను టిడిపిలో చేర్చారు. ఈ మండలంలో తనకున్న పట్టును మరోసారి నిరూపించుకొన్నారు. ఉపఎన్నికలకు వారం రోజుల ముందే గోస్పాడు మండలంలో చోటుచేసుకొన్న పరిణామం వైసీపీకి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి,వైసీపీలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలను చేస్తున్నాయి.

గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?

వైసీపీ చీఫ్ జగన్ ఈ నెల 9వ, తేది నుండి నంద్యాలలో ఉంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ, తేదిన, 20వ, తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

టిడిపి, వైసీపీలకు చెందిన కీలక నాయకులు నంద్యాల అసెంబ్లీ స్థానంలోనే మకాం వేశారు. రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికను 2019 ఎన్నికలకు సెమీ పైనల్‌గా భావిస్తున్నారు. ఈ తరుణంలో నంద్యాల ఉపఎన్నికపై ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.

గోస్పాడులో పట్టును నిరూపించుకొన్న గంగుల ప్రతాప్‌రెడ్డి

గోస్పాడులో పట్టును నిరూపించుకొన్న గంగుల ప్రతాప్‌రెడ్డి

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గోస్పాడు మండలం అభ్యర్థుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపనుంది. 2014 ఎన్నికల్లో ఈ మండలం నుండి భూమా నాగిరెడ్డికి సుమారు 3 వేల ఓట్లు మెజారిటీ వచ్చింది.ఈ మెజారిటీతోనే ఆయన శిల్పా మోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. దీంతో వైసీపీ, టిడిపిలు ఈ మండలంపై కేంద్రీకరించాయి. నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం కన్పిస్తోందని విశ్లేషకుల అంచనావేస్తున్నారు.నంద్యాల మాజీ పార్లమెంట్‌ సభ్యుడు గంగుల ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన 24 గంటల్లోపే వైసీపీకి పట్టు ఉందని భావిస్తున్న గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన 800 మందిని టీడీపీలోకి చేర్చారు.

 గంగుల వ్యూహత్మక అడుగులు

గంగుల వ్యూహత్మక అడుగులు

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో తన పట్టు ఏ మాత్రం సడలేదనే విషయాన్ని నిరూపించుకొనేందుకు గంగుల ప్రయత్నిస్తున్నారు. గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో తమకు ఏకపక్షంగా పోలింగ్‌ ఉంటుందని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గంగుల ప్రతాపరెడ్డి తిప్పికొట్టారు. వైసీపీకి కీలకంగా ఉన్న యాళ్లూరులో వైసీపీలో ఉన్న కీలకనేతలను టిడిపిలో చేర్పించారు. శనివారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సమక్షంలో గంగుల ప్రతాపరెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాళ్లూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. రానున్న రోజుల్లో కూడ గంగుల ప్రతాప్‌రెడ్డి ఈ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయని తేటతెల్లమైంది.

గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?

గోస్పాడుపై గంగుల ప్రతాప్‌రెడ్డి గురి

గోస్పాడుపై గంగుల ప్రతాప్‌రెడ్డి గురి

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో గోస్పాడు మండలం కీలకంగా ఉంది. ఈ మండలంలో భూమా బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఇదే మండలంలో గంగుల ప్రతాప్‌రెడ్డి అనుచరులు కూడ ఉన్నారు. ఈ మండలంలోనే రెండు కుటుంబాలకు చెందిన గ్రూపులు ఆదిపత్యం కోసం ఘర్షణలకు దిగిన సందర్భాలున్నాయి.ఈ మండలం గతంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఉండేది. గతంలో 40 ఏళ్ల పాటు తమ వర్గంలో కొనసాగుతూ వస్తున్న పలువురిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చటంతో పాటు టీడీపీని గెలిపించేందుకు వ్యూహాత్మకంగా గంగుల ప్రతాప్‌రెడ్డి ప్రయత్నాలను చేస్తున్నారు.

రివర్స్:టిడిపికి గుడ్ బై, వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమానే కారణమా?రివర్స్:టిడిపికి గుడ్ బై, వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమానే కారణమా?

నంద్యాల ప్రముఖులతో గంగుల చర్చలు

నంద్యాల ప్రముఖులతో గంగుల చర్చలు

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుండి పలు దఫాలు ఎంపీగా విజయం సాధించిన గంగుల ప్రతాప్‌రెడ్డి ...నంద్యాల పట్టణంపై కూడ కేంద్రీకరించారు. నంద్యాలలో తన అనుచరులు...ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు.దాదాపు మూడేళ్ళపాటు క్రియాశీలక రాజకీయాలకు ప్రతాప్‌రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆయన టిడిపిలో చేరడంతో ఆయన వర్గీయులను తిరిగి తనతో పార్టీలో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం తమకు రాజకీయంగా కలిసివస్తోందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

English summary
Former Nandyal Mp Gangula Pratap reddy followers 800 members joined in Tdp from Yaalur village in gospadu mandal on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X