ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్:టిడిపికి గుడ్ బై, వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమానే కారణమా?

గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని ఆయన మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. ఆనాటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:కర్నూల్ జిల్లాలో టిడిపి షాక్ తగిలింది. వైఎస్ఆర్ సి పి నుండి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో టిడిపికి దూరంగా ఉంటున్నారు గంగుల ప్రభాకర్ రెడ్డి. బుదవారం నాడు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గంగుల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో వైఎస్ఆర్ సి పిలో చేరారు.

2014 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు గంగుల ప్రభాకర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో ఆయన ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.

అయితే 2016 లో వైఎస్ఆర్ సి పి కి రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు భూమా నాగిరెడ్డి , ఆయన కూతురు ఆళ్ళగడ్డ ఎంఏల్ఏ అఖిల ప్రియ.

భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు టిడిపిలో చేరడాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే ఈ వ్యతిరేకతను టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.

భూమా రాకను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపిలో చేరిక

భూమా రాకను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపిలో చేరిక

కర్నూల్ జిల్లా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి, గంగుల కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు సాగుతూండేది. ఈ ఆధిపత్య పోరులో అనేక హత్యలు, దాడులు కూడ చోటుచేసుకొన్నాయి.అయితే గంగుల ప్రభాకర్ రెడ్డి సోదరుడు ప్రతాప్ రెడ్డి ఎంఏల్ఏగా, ఎంపిగా కూడ పనిచేశారు.అయితే 2014 లో ప్రభాకర్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.భూమానాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. భూమా టిడిపిలో చేరిన నాటి నుండి గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన టిడిపిని వీడి వైఎస్ఆర్ లో చేరారు గంగుల ప్రభాకర్ రెడ్డి.

వైఎస్ఆర్ సి పి బలోపేతానికి కృషి

వైఎస్ఆర్ సి పి బలోపేతానికి కృషి

కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సి పి బలోపేతానికి కృషి చేస్తానని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సిపిలో విజయం సాధించిన ఎంఏల్ఏలు 2016 తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ సిపిని వీడి టిడిపిలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను వైఎస్ఆర్ సిపి బలమైన నాయకుల కోసం ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపిని వీడి వైఎస్ఆర్ సిపి లో చేరారు.

గంగుల ప్రభాకర్ రెడ్డికి బంఫర్ ఆఫర్

గంగుల ప్రభాకర్ రెడ్డికి బంఫర్ ఆఫర్

టిడిపిని వీడి వైఎస్ ఆర్ సిపిలో చేరదిన గంగుల ప్రభాకర్ రెడ్డికి వైఎస్ఆర్ సిపి బంఫర్ ఆఫర్ ఇవ్వనుంది. తన వెంట 35 మంది ఎంపిటిసిలు, 37 మంది సర్పంచ్ లు కూడ వైఎస్ఆర్ సి పిలో చేరారు. అయితే పార్టీ మారిన గంగుల ప్రభాకర్ రెడ్డికి ఎంఏల్ సి పదవిని ఇవ్వనున్నట్టు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతోంది.

టిడిపి నుండి వైసిపిలోకి

టిడిపి నుండి వైసిపిలోకి

ఇతర పార్టీల నుండి టిడిపిలోకి చేరేలా ఫిరాయింపులను ఆ పార్టీ ప్రోత్సహిస్తోంది.అయితే ఇదే తరుణంలో ప్రధానంగా వైఎస్ఆర్ సి పి నుండి ప్రజా ప్రతినిదులు, నాయకులు ఆ పార్టీ నుండి టిడిపిలో చేరారు. అయితే ప్రస్తుతం రివర్స్ అయింది. కర్నూల్ జిల్లా నుండే టిడిపి నుండి వైఎస్ఆర్ సి పి లోకి చేరారు. ఈ పరిణామం అధికార టిడిపికి షాక్ .

English summary
gangula prabhakar reddy joined in ysrcp on wednesday.Gangula prabhakar reddy opposed to join Bhuma Nagi reddy in Tdp.There is a rumour ysrcp will nominate Gangula prabhakar reddy as MLC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X