వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగుల Vs భూమా, ఒకే పార్టీలో ఇమిడేనా, అఖిలకు షాకేనా?

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సమయంలో కర్నూల్ జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకొంటున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సమయంలో కర్నూల్ జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకొంటున్నాయి. అధికార టిడిపి , విపక్ష వైసీపీలు ఒకరిపై మరోకరు పై చేయి సాధించేందుకు వ్యూహలను రచిస్తున్నాయి.

రివర్స్:టిడిపికి గుడ్ బై, వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమానే కారణమా?రివర్స్:టిడిపికి గుడ్ బై, వైసిపిలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమానే కారణమా?

నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడం వైసీపీ వర్గీయులతో భూమా వర్గీయులకు షాక్ కల్గించే పరిణామంగానే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భూమా, గంగుల కుటుంబాలకు తరాల నుండి ఆధిపత్యపోరు సాగుతోంది.

అయితే గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడం భూమా కుటుంబానికి షాక్ కల్గించే పరిణామమేననే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భూమా కుటుంబానికి, గంగుల ప్రతాప్‌రెడ్డి కుటుంబాలకు మధ్య తరాల నుండి ఆధిపత్య పోరు సాగుతోంది.

తండ్రి నుండి వారసత్వంగా ఆస్తులతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాలు కూడ భూమా కుటుంబానికి వచ్చాయనే చెప్పవచ్చును.అయితే ఫ్యాక్షన్‌కు స్వస్తి పలకాలని 1990 దశకంలో భూమా నాగిరెడ్డి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు.ఈ యాత్ర ద్వారా శాంతి కోసం ప్రయత్నించారు.

గంగుల వర్సెస్ భూమా కుటుంబం

గంగుల వర్సెస్ భూమా కుటుంబం

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని ఆళ్ళగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆది నుండి గంగుల కుటుంబానికి, భూమా కుటుంబాలకు ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఈ రెండు కుటుంబాలకు ఆయా గ్రామాల్లో గ్రూపులున్నాయి. ఫ్యాక్షన్ గొడవలు తరచూ చోటుచేసుకొనేవి. ప్రత్యర్థులు భూమా నాగిరెడ్డి తండ్రి బాలిరెడ్డిని చంపేయడంతో నాగిరెడ్డి చదువుకు స్వస్తిచెప్పి స్వగ్రామానికి చేరుకొన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు తండ్రుల కాలం నుండి సాగుతూనే ఉంది. దీంతో ఈ రెండు కుటుంబాలు వేర్వేరు రాజకీయపార్టీల్లో కొనసాగాయి.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
వ్యూహత్మకంగానే ప్రతాప్‌రెడ్డికి టిడిపి తీర్థం?

వ్యూహత్మకంగానే ప్రతాప్‌రెడ్డికి టిడిపి తీర్థం?

గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడం భూమా ఫ్యామిలీకి షాకింగ్ కల్గించే నిర్ణయమే. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఈ తరుణంలో ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడం భూమా ఫ్యామిలీకి ఇబ్బంది కల్గించే పరిణామమేని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టిడిపిలో చక్రం తిప్పే నేత ప్రస్తుతం లేరు. భూమా నాగిరెడ్డి బతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మంత్రి అఖిలప్రియ రాజకీయాలకు కొత్త. ఆమె మూడేళ్ళుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. బ్రహ్మనందరెడ్డి ఈ ఉప ఎన్నికతోనే రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరాలనే నిర్ణయం టిడిపికి కలిసిరానుందని ఆ పార్టీ భావిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడ టిడిపికి కలిసివచ్చే పరిణామని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

చక్రం తిప్పిన అచ్చెన్నాయుడు

చక్రం తిప్పిన అచ్చెన్నాయుడు

కర్నూల్ జిల్లాలో వైసీపీకి చెందిన కీలకమైన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేలా ఆ జిల్లా ఇంచార్జీ మంత్రి అచ్చెన్నాయుడు చక్రం తిప్పారు. గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడంలో కూడ అచ్చెన్నాయుడు కీలక భూమిక పోషించారు. భూమా నాగిరెడ్డితో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడంలో అచ్చెన్న కీలకంగా వ్యవహరించారని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరడానికి ప్రస్తుత డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి కీలకంగా వ్యవహరించారు.

గంగుల కుటుంబం కాంగ్రెస్‌తోనే

గంగుల కుటుంబం కాంగ్రెస్‌తోనే

గంగుల కుటుంబం సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. కానీ, భూమా కుటుంబం టిడిపితో ఉంది. ఫ్యాక్షన్ గొడవలను పురస్కరించుకొని రాజకీయ అండ కోసం ఈ రెండు కుటుంబాలు ఏదో ఒక పార్టీని ఆశ్రయించేవారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంగుల ప్రతాప్‌రె్డ్డి నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి, ఆళ్ళగడ్డ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. భూమా నాగిరెడ్డి సోదరుడు వీరశేఖర్‌రెడ్డి ఆళ్ళగడ్డ నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. విజయశేఖర్‌రెడ్డి మరణంతో భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయి. టిడిపి, పిఆర్‌పి, కాంగ్రెస్, వైసీపీలలో చేరి చివరికి టిడిపిలో ఉంటున్న సమయంలోనే భూమా నాగరెడ్డి మరణించారు.

భూమా చేరికతో గంగుల ప్రభాకర్‌రెడ్డి వైసీపీలోకి

భూమా చేరికతో గంగుల ప్రభాకర్‌రెడ్డి వైసీపీలోకి

భూమానాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టిడిపిలో చేరడంతో టిడిపిలో కొనసాగిన గంగుల ప్రభాకర్‌రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందే గంగుల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. అయితే అనుహ్యంగా భూమా కుటుంబం టిడిపిలో చేరడంతో గంగుల ప్రభాకర్‌రెడ్డి టిడిపిని వీడారు. నాలుగు మాసాల క్రితం ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరారు.ఆయన వైసీపీలో చేరిన వారం రోజులకే ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.తదనంతరం గంగుల ప్రతాప్‌రెడ్డి కూడ వైసీపీ చీఫ్ జగన్‌తో ఇటీవల సమావేశమయ్యారు.ఆయన కూడ వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, అనుహ్యంగా టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామమే.

English summary
Nandyala former MP Gangula Pratapreddy joined in Tdp at Amaravati on Wednesday. This news shocked to Ap minister Bhuma akhilapriya.There is a rivalry between Gangula , Bhuma families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X