వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలకు ఉపఎన్నిక: జగన్‌కు గట్టి షాక్, టిడిపిలో చేరిన గంగుల, అందుకేనా?

ఉప ఎన్నికల వేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికలకు వారం ముందు ఈ చేరిక వైసిపికి ఎదురు దెబ్బ.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఉప ఎన్నికల వేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికలకు వారం ముందు ఈ చేరిక వైసిపికి ఎదురు దెబ్బ.

టిడిపిలోకి గంగుల.. వైసిపికి షాకే

టిడిపిలోకి గంగుల.. వైసిపికి షాకే

బుధవారం ఆయన తన కుమారులు, సోదరుడు, సన్నిహితులతో కలిసి సచివాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిలు గంగులను సీఎం వద్దకు తీసుకు వచ్చారు. వారం రోజుల్లో నంద్యాల ఉపఎన్నిక. ఇలాంటి సమయంలో గంగుల వైసిపిని వీడటం ఆ పార్టీకి గట్టి షాక్.

Recommended Video

Mahesh fans Support To YSRCP in Nandyal By polls, What About Pawan Kalyan | Oneindia Telugu
పీవీ నర్సింహా రావు కోసం త్యాగం

పీవీ నర్సింహా రావు కోసం త్యాగం

పీవీ నర్సింహా రావు ప్రధాని అయ్యాక ఆయన ఎన్నిక కోసం తన ఎంపీ పదవిని త్యాగం చేయడం ద్వారా గంగుల ప్రతాప్ రెడ్డి అప్పట్లో వార్తల్లోకి వచ్చారు.

సోదరుడు ఇటీవలే వైసిపిలోకి..

సోదరుడు ఇటీవలే వైసిపిలోకి..

గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి ఇటీవలే టిడిపి నుంచి వైసిపిలో చేరారు. ఆ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడానికి ముందు గంగుల ప్రతాప్ రెడ్డి కూడా నంద్యాల అభ్యర్థిగా రేసులో ఉన్నారు.

నొచ్చుకున్నారా?

నొచ్చుకున్నారా?

శిల్పా మోహన్ రెడ్డి చేరడం, తదనంతర పరిణామాలతో గంగుల ప్రతాప్ రెడ్డి నొచ్చుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ మేరకు టిడిపి నేతలతో మాట్లాడిన ఆయన, చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

English summary
Former MP Gangula Pratap Reddy joined Telugu Desam. He met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X