నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది పద్ధతి కాదు: నంద్యాలపై బాబుకు టిడిపి నేత గంగుల డిమాండ్!

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని ప్రజలు అద్భుత విజయంతో గెలిపించారని, ఇక చంద్రబాబు వారి రుణం తీర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి గురువారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని ప్రజలు అద్భుత విజయంతో గెలిపించారని, ఇక చంద్రబాబు వారి రుణం తీర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి గురువారం అన్నారు.

కడపలో జగన్‌కు షాక్: డిఎల్ రవీంద్రారెడ్డితో బాబు చెక్? టిడిపిలో మరో చిచ్చుకడపలో జగన్‌కు షాక్: డిఎల్ రవీంద్రారెడ్డితో బాబు చెక్? టిడిపిలో మరో చిచ్చు

ఇక రుణం తీర్చుకోండి

ఇక రుణం తీర్చుకోండి

ఆయన ఆళ్లగడ్డలో విలేకరులతో మాట్లాడారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో టిడిపిని గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం చంద్రబాబు సీమ ప్రాంతానికి శ్రీశైలం ద్వారా నీరు ఇవ్వాలని గంగుల ప్రతాప్ రెడ్డి సూచించారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం వస్తున్న ఇన్ ఫ్లోతో సీమ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయన్నారు.

అప్పుడు దిగువకు

అప్పుడు దిగువకు

వస్తున్న నీటిని వస్తున్నట్లుగా కిందకు వదలకుండా డ్యామ్ పూర్తిస్థాయిలో నిండే వరకు వేచి చూడాలని గంగుల అన్నారు. సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తుఫాన్లు వచ్చే అవకాశాలుంటాయని, అప్పుడు శ్రీశైలానికి భారీగా ఇన్ ఫ్లో ఉంటుందన్నారు. ఆ సమయంలో దిగువకు నీటిని తరలించినా ఎవ్వరికీ ఎలాంటి ఆక్షేపణ ఉండదన్నారు.

అది సరైనచర్య కాదు

అది సరైనచర్య కాదు

దిగువకు వదిలిన నీటిని మళ్లీ వెనక్కి తీసుకురాలేమనే విషయాన్ని ప్రభుత్వం మరిచిపోవద్దని గంగుల ప్రతాప్ రెడ్డి సూచించారు. కరెంటు కోసం నీటిని వినియోగించడం సరైన చర్య కాదని ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

తెలంగాణతో మాట్లాడండి

తెలంగాణతో మాట్లాడండి

అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి అయినా సరే ఏపీ ప్రభుత్వం రాయలసీమ రైతుల పక్షాన నిలవాలని గంగుల అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గరిష్ఠంగా నీటిని సీమ ప్రాజెక్టులకు తరలించి ఈ ప్రాంత ప్రజల, రైతుల నీటి కష్టాలను తీర్చాలని కోరారు.

English summary
Telugu Desam Party leader and former MP Gangula Pratap Reddy suggestion to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X