వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆనం-గంటా భేటీతో...ఎపి రాజకీయాల్లో పెను ప్రకంపనలు:అసలు ఏం జరుగుతోంది?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

నెల్లూరు:మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకాంత భేటీ ఎపి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చల సారాంశం గురించి బైటకు ఏమాత్రం వెల్లడి కానప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా ప్రాధాన్యత కలిగినవిగా సర్వత్రా చర్చించుకుంటున్నారు.

అయితే ఆనం వివేకా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడిగా తనను పరామర్శించడానికే మంత్రి గంటా వచ్చారు తప్ప తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక సర్వే నేపథ్యంలో మంత్రి గంటా తీవ్ర అసంతృప్తికి లోనై అలక వహించిన నేపధ్యంలో...తాజాగా అలాంటి స్థితిలోనే ఉన్న ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ కావడం ఇటు టిడిపి...అటు వైసిపితో సహా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆనం-గంటా సమావేశం...కలకలం

ఆనం-గంటా సమావేశం...కలకలం

మంత్రి గంటా ప్రత్యేకంగా విశాఖ నుంచి నెల్లూరు వచ్చి శనివారం రాత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో ఆయనతో భేటీ కావడం ఎపి రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు వీరిద్దరూ సుమారు గంట సేపు ఏకాంతంగా చర్చించుకోవడం కూడా వివిధ రకాల చర్చలకు తావిచ్చింది. అయితే తనతో ఉన్న పాత పరిచయాల నేపథ్యంలో సోదరుడు వివేకా మరణం తరువాత కలవడం కుదరకపోవడం చేత తనను పరామర్శించడానికే గంటా వచ్చారు తప్ప తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదని ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో చెబుతున్నారు.

 ఆనం...ఆగేది లేదా?

ఆనం...ఆగేది లేదా?

చంద్రబాబు తమకు అన్యాయం చేశారంటూ ఆనం రామనారా యణరెడ్డి టిడిపిని వీడి వైసిపిలో చేరుతున్నట్లు గత కొన్ని రోజులగా ప్రచారం ముమ్మరంగా సాగడంతో పాటు ఆనం వైపు నుంచి కూడా ఆ విధమైన సంకేతాలు వెలువడుతున్నసంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇదే నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అను చరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ కారణాల రీత్యా టిడిపిలో తాను ఇమడలేకపోతున్నానని ఆయన ఈ సమావేశాల్లో ఆయన తన అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం.

టిడిపి...సర్ధుబాటు యత్నాలు

టిడిపి...సర్ధుబాటు యత్నాలు

అయితే ప్రస్తుత తరుణంలో ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున ఆయనను పార్టీ వీడకుండా చూడాలని బుజ్జగించేందుకు గాను టిడిపి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆనంను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదని తెలిసింది.

దీంతో...మంత్రి గంటా...రంగంలోకి

దీంతో...మంత్రి గంటా...రంగంలోకి

దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావుకు గతంలో ఆనం రామనారాయణతో మంచి సాన్నిహిత్యం ఉండేదని, ఆయన చెబితే వినవచ్చని తెలిసి టిడిపి గంటాను రంగంలోకి దింపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శనివారం వీఎస్‌యూలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి గంటా రాత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటికివెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. టీడీపీలో కొనసాగాలని, ఆనం కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆనంకు తెలిపినట్టు తెలిసింది. అయితే ఈ సూచనను రామ నారాయణరెడ్డి సున్నితంగా తిరస్కరిస్తూ టీడీపీలో ఇమడలేము, ఏమీ అనుకోవద్దని స్పష్టంగా చెప్పేశారని తెలిసింది.

అయితే...భిన్నవాదనలు

అయితే...భిన్నవాదనలు

అయితే గంటా, ఆనం భేటీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మంత్రి గంటానే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పైగా తన అసంతృప్తి విషయమై మాట్లాడుతూ ఏ సమయంలో ఎప్పుడు ఏమి చెప్పాలో తనకు స్పష్టత ఉందని,సమయం వచ్చినపుడు అన్నీ చెబుతానని హెచ్చరికలు జారీ చేసిన మంత్రి గంటాను పార్టీని వీడేందుకు సంసిద్దమైన ఆనంతో రాయబారం కోసం టిడిపి అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ పంపదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి గంటా, ఆనంతో సుదీర్ఘ భేటీతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు టిడిపి గురించి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున నష్ట నివారణ కోసం టిడిపినే ఆనంతో రాయబారం కోసం గంటాను పంపినట్లు ప్రచారం చేసే అవకాశం ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

గంటా శ్రీనివాస్ రావు కు టీడీపీ వర్గాలు బుజ్జగింపులు
ఏం చేద్దామనా?...ఏదైనా చేద్దామనా?

ఏం చేద్దామనా?...ఏదైనా చేద్దామనా?

అయితే మరి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల సమయానికి కొన్ని కారణాల రీత్యా వైసిపి లోకి కాకుండా జనసేనలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, అయితే తానొక్కడే కాకుండా తనతో పాటుగా కొందరు పేరున్న, సీనియర్ నేతలను ఆ పార్టీలోకి తీసుకెళ్లాలని ఆయన పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. ఆ క్రమంలోనే టీడీపీని వీడే దిశలో ఉన్న ఆనంను ఆయన కలిసి ఉంటారనే విశ్లేషణలు జరుగుతున్నాయి. మరికొందరు వీరు బిజెపిలోకి వెళ్లే అవకాశాలను కొట్టిపడేయలేమని, బిజెపి అధిష్టానం కొన్ని ప్రత్యేక చర్యల ద్వారా కొందరు ప్రముఖ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోందని...అవి సఫలం కావని చెప్పలేమని పేర్కొంటున్నారు. అయితే వీరి భేటి వెనక రహస్యం ఏంటో తెలియాలంటే కొద్దికాలం వేచి చూడాల్సిందే!

English summary
Nellore: Ganta Srinivasa Rao, disgruntled leader of TDP met senior leader Anam Ramanarayana Reddy saturday has became debate among political circles. Ganta went to Nellore and met Anam there and had spent couple of hours with him. Anam told media that there no political significance for this meet and Ganta came to console the family who lost Anam Viveka recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X