వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

|
Google Oneindia TeluguNews

బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో ఆయన సంప్రదింపులు జరుపుతూ బిజెపిలో చేర్చేందుకు గంటా శ్రీనివాస రావు టీడీపీ ఎమ్మెల్యేలను కూడగడుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో గంటా కూడా బీజేపీలో చేరతారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వచ్చాక భారీ ప్రక్షాళన చేసిన సీఎం జగన్ .. ఎవర్ని ఎక్కడ నియమించారంటేఅధికారంలోకి వచ్చాక భారీ ప్రక్షాళన చేసిన సీఎం జగన్ .. ఎవర్ని ఎక్కడ నియమించారంటే

 ఏపీలో గంటా పార్టీ మారతారనే దుమారం .. బీజేపీలో చేరేందుకు గంటా సిద్ధమని ప్రచారం

ఏపీలో గంటా పార్టీ మారతారనే దుమారం .. బీజేపీలో చేరేందుకు గంటా సిద్ధమని ప్రచారం

ఏపీలో చంద్రబాబు లేని సమయంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు టీడీపీకి చేటు చేసేవిగా ఉన్నాయి. ఎవరికి ప్రాధాన్యం ఇచ్చి టీడీపీ హయాంలో కీలాక్ పదవులు కట్టబెత్తారో వారంతా ఇప్పుడు చంద్రబాబుకు ఝలక్ ఇస్తున్నారు . తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు ఊహించని విధంగా బీజేపీలో చేరి రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇక దీంతో ఏపీలో మరికొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సనాహాలు చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఈ నేపధ్యంలోనే గంటా పేరు ప్రధానంగా వినిపిస్తుంది. చాలా రోజు క్రితం నుంచే గంటా శ్రీనివాస రావు బిజెపి నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంటా శ్రీనివాస రావు ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు.

తనతో పాటు మరింత మంది శాసన సభ్యులతో బీజేపీలో చేరే యత్నం చేస్తున్న గంటా అంటున్న బీజేపీ

తనతో పాటు మరింత మంది శాసన సభ్యులతో బీజేపీలో చేరే యత్నం చేస్తున్న గంటా అంటున్న బీజేపీ

బిజెపిలో చేరటానికి, తనతో పాటు మరికొంత మందిని చేర్చటానికి గంటా శ్రీనివాస రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరింత మంది ఎమ్మెల్యేలను కూడగట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం . ఫిరాయింపుల చట్టం నిబంధనలను అధిగమించడానికి మూడింట రెండు వంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాస రావుతో పాటు టీడీపీ శాసనసభ్యులు విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ , రేపల్లె ఎమ్మెల్యే అన్నంగి సత్యప్రసాద్ , కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి , వల్లభనేని వంశీ మోహన్, గన్నవరం తాము బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారంటూ వినిపిస్తున్న వార్తలతో ఏపీ టీడీపీలో కలకలం రేగింది. గంటా శ్రీనివాస రావు ఒక వ్యాపారవేత్త అయన ఇప్పటి వరకు మూడు పార్టీల్లో పనిచేశారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాస రావు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు ఆయన కాంగ్రెసులోకి వెళ్లారు. ఆతర్వాత ఆయన తిరిగి టీడీపీలో చేరారు . ఇక ఈ నేపధ్యంలోనే గంతాకు పార్టీ మార్పు కొత్తేమీ కాదని గంటా శ్రీనివాస రావు బిజెపి జాతీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని, కొద్ది రోజుల్లో ఏదైనా జరగవచ్చునని బిజెపి నేతలు చెప్పటం గమనార్హం .

గంటా పార్టీ మారినా ఆశ్చర్యం లేదు.. బీజేపీలో చేరే అవకాశం అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

గంటా పార్టీ మారినా ఆశ్చర్యం లేదు.. బీజేపీలో చేరే అవకాశం అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

ఇక ఇదే సమయంలో గంటా కూడా పార్టీ మారతారని మంత్రి అవంతి సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాటల తూటాలు పేల్చారు . టీడీపీకి భవిష్యత్ లేదని మంత్రి అవంతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఎదుర్కొనలేక టీడీపీ నేతలను చంద్రబాబు బీజేపీలోకి పంపుతున్నారని అవంతి ఆరోపణలు గుప్పించారు. శనివారం అవంతి శ్రీనివాస్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావును చంద్రబాబు బీజేపీలోకి పంపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు. ఐదేళ్లలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలోకి వలసలని విమర్శించారు. చంద్రబాబు తమ వద్దకే వస్తారని ఎన్నికల ముందు అమిత్ షా కూడా చెప్పారని మంత్రి అవంతి గుర్తుచేశారు.

English summary
Ganta Srinivasa Rao is trying to join in the BJP and he is trying to take few MLAs form TDP along with him . Attempts are being made to mobilize more MLAs.At the same time, Ganta will change the party, Minister Avanti srinivas said. AP former CM Chandrababu Naidu has been targeted by AP minister Avanti Srinivas. Minister Avanti said that TDP has no future. Avanti has alleged that Chandrababu is sending TDP leaders to the BJP without facing YS Jagan. It is not surprising that if Chandrababu send Ganta Srinivasarao into BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X