• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రా పట్ల కేసీఆర్ వైఖరి ఎంత దారుణమో తెలుసా: గంటా సంచలన వ్యాఖ్యలు

|
  Ap Assembly Election 2019 : జగన్,కేసీఆర్ దోస్తీ పై గంటా సంచలన వ్యాఖ్యలు ! || Oneindia Telugu

  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్, కెసిఆర్, మోడీ టార్గెట్ గా టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వారు ముగ్గురు ఒకటే అంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.

  ఫ్యాన్ తిరగాలంటే కేసీఆర్ , మోడీల సహకారం కావాలి .. అందుకే ఇదంతా అన్న గంటా

  ఫ్యాన్ తిరగాలంటే కేసీఆర్ , మోడీల సహకారం కావాలి .. అందుకే ఇదంతా అన్న గంటా

  ఏపీలో ఫ్యాన్ తిరగాలంటే తెలంగాణలో కేసీఆర్ స్విచ్ వెయ్యాలని, ఢిల్లీలో ఉన్న మోడీ కరెంట్ ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక ఇదే క్రమంలో జగన్ కి , కెసిఆర్ కి ఉన్న దోస్తీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాసరావు. అంతేకాదు ఆంధ్రా ప్రజలంటే కెసిఆర్ కు చాలా దారుణమైన అభిప్రాయం ఉంటుందని వ్యాఖ్యానించారు.

  తెలంగాణాలో ఎన్నికలు ముగిసిన తర్వాత కేవలం చంద్రబాబు అక్కడ పోటీ చేసి టీఆర్ఎస్ కు వ్యతిరేఖంగా ప్రచారం చేశారన్న నేపథ్యంలో కెసిఆర్ అతి త్వరలోనే బాబుకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీశాయి .ఆ తర్వాత జరిగిన పరిణామాల రీత్యా జగన్ తో కలిసి ముందడుగు వేద్దామని తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

  జగన్ ఇంటర్వ్యూ తో వారి స్నేహం ఎలా ఉంది తెలుస్తుంది

  జగన్ ఇంటర్వ్యూ తో వారి స్నేహం ఎలా ఉంది తెలుస్తుంది

  జగన్ కెసిఆర్ లు ఇద్దరు ఒకరికొకరు పరస్పర మద్దతు ఇచ్చుకోవడంతో ఇద్దరి మీదా పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చాయి. అయినా కేసీఆర్ ఏపీలో పోటీ చెయ్యలేదు . కానీ లోపాయికారిగా వైసీపీకి సహకరిస్తుంది అని టీడీపీ నేతలుభావిస్తూ అదే ప్రచారం చేస్తున్నారు. తాజాగా జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పై టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్, కేసీఆర్ ల కలయిక మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

  ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

  ఆంధ్రా ప్రజలను రాక్షులు అన్న వారితోనా జగన్ స్నేహం .. గంటా వ్యాఖ్యలు

  ఆంధ్రా ప్రజలను రాక్షులు అన్న వారితోనా జగన్ స్నేహం .. గంటా వ్యాఖ్యలు

  ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ఆంధ్రా ప్రజలంతా లంకలో ఉండే రాక్షసులని, వారి బిర్యాని పేడలా ఉంటుందని , వారు తినే ఉలవచారు మేము ఇక్కడ పశువులకు వేస్తాము,వారిని ఛీ పో అని అన్నా సరే ఇక్కడే ఉండి వేలాడుతున్నారని అన్నారని గుర్తు చేశారు. అలాంటి కెసిఆర్ కు ఇప్పుడు జగన్ మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు గంటా . కెసిఆర్ తో కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి "ప్రత్యేకహోదా" రాదన్న విషయం జగన్ కు కూడా తెలుసన్న గంటా జగన్, కేసీఆర్ లు కలిసి హోదా సాధిస్తారనే మాట కల్ల అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  English summary
  TDP leader Ganta srinivasarao made sensational comments on Jagan and KCR . He said that with the current passed by Modi KCR operates the power button the fan will work in AP .In the same sequence, Ganta Srinivasa Rao made sensational comments on Jagan's friendship with KCR. Ganta reminded about KCR's view and opinion on the Andhra people . KCR insulted andhra people and their self respect so many times . Now how can jagan do friendship with KCR .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more