• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ బీజేపీకి, వైసీపీకి గంటా షాక్ ... మార్పుకు నాంది అంటూ ఏం చేశారో తెలుసా ?

|

గంటా శ్రీనివాసరావు టీడీపీలో సైలెంట్ గా పని చేస్తున్నారా ? నిన్నా మొన్నటి దాకా గంటా శ్రీనివాసరావు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారు అని వచ్చిన వార్తలకు చెక్ పడినట్టేనా ? విశాఖ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వ్యవహారం పార్టీలోనే అర్ధం కాని పరిస్థితి ఉన్న నేపధ్యంలో గంటా చేసిన పనితో అటు టీడీపీ నేతలకు సైతం క్లారిటీ వచ్చిందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది .

స్థానిక సంస్థల ఎన్నికలు ... జగన్ నిర్ణయంతో వైసీపీ నేతల్లో టెన్షన్

 గంటా పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం

గంటా పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం

గంటా శ్రీనివాసరావు గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసి పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేత. గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవటంతో గంటా సైలెంట్ అయ్యారు. ఒకపక్క అధికార వైసీపీ గంటాను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న నేపధ్యంలో బిజెపిలోకి వెళ్లేందుకు ఆసక్తితో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు నాయకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సుజనా చౌదరితో ఆయన సంప్రదింపులు జరుపుతూ బిజెపిలో చేర్చేందుకు గంటా శ్రీనివాస రావు టీడీపీ ఎమ్మెల్యేలను కూడగడుతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి .

సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు

సైలెంట్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు

గంటా పార్టీ మారలేదు. ఇక ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెప్పటాన్ని గంటా స్వాగతించారు. జగన్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో గంటా పాజిటివ్ గా స్పందించారు . ఇక ఈ నేపధ్యంలోనూ ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది . కానీ గంటా మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇక సుజనా చౌదరితో , కొడాలి నానీతో టచ్ లో ఉండే గంటా అటు బీజేపీకి ఇటు వైసీపీ కి ఝలక్ ఇచ్చారు . సైలెంట్ గా వుంటూనే బీజేపీ నుండి టీడీపీలోకి మూడు వందల మందిని లాగేశారు .

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీకి గంటా షాక్

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీకి గంటా షాక్

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీకి గంటా షాక్ ఇచ్చారు. తాజాగా సోమవారం విశాఖ పట్నంలోని టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి గంటా సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పచ్చకండువా కప్పి మరీ గంటా ఆహ్వానించారు. ఈకార్యక్రమం ద్వారా గంటా పార్టీ మారతారు అన్న ప్రచారానికి తెరపడింది .

బీజేపీ నుండి 300 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరిక

బీజేపీ నుండి 300 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరిక

అంతే కాదు బీజేపీ నుండి టీడీపీలోకి నేతలను తీసుకురావటంతో బీజేపీకి షాక్ ఇచ్చినట్టు అయ్యింది .ఇక ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ.. 300 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ నుంచి టీడీపీలోకి చేరడం మార్పుకు నాంది అని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో లక్ష కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణి చేయడం ఒక చరిత్ర అని చెప్పిన గంటా రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నా విశాఖలో చంద్రబాబు చేసిన అభివృద్ధి చూసే నాలుగు స్థానాల్లో ప్రజలు టీడీపీని గెలిపించారని చెప్పారు .

  Visakhapatnam As AP Executive Capital : Here Is the Reason ! || Oneindia Telugu
   స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

  స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

  ఇక టీడీపీ ప్రజల్లోకి వెళ్లనుందని చెప్పిన గంటా ఫిబ్రవరి 19వ తేది నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు . స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని గంటా పిలుపునిచ్చారు. త్వరలో టీడీపీలోకి మరిన్ని చేరికలుంటాయని గంటా చెప్పుకొచ్చారు.మొత్తానికి తాజా పరిణామాలతో గంటా టీడీపీలో యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నిన్నా మొన్నటి దాకా డైలమా లో ఉన్న గంటా ఇప్పుడు ఒక క్లారిటీ తన చర్య ద్వారా ఇచ్చినట్టు విశాఖలో చర్చ నడుస్తుంది.

  English summary
  As the elections of local bodies are nearing, the BJP has given a shock by TDP leader Ganta srinivas rao . Recently, a large number of BJP leaders and activists from Visakha North constituency were joined in TDP at TDP office in Visakhapatnam on Monday. With this step The campaign ended about ganta srinivas rao party switched on.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X