వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి గంటా కొత్త ట్విస్ట్: చిరుతోనూ సన్నిహితంగా : వైసీపీ కండీషన్లు అవే..అందుకే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ganta Srinivas Rao Re Entered Into TDP Office || చాలారోజుల తరువాత TDP ఆఫీస్ కి వచ్చిన గంటా

టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచినా..పార్టీ అధికారంలోకి రాలేదు. మాజీ మంత్రిగా చక్రం తిప్పినా..ఇప్పుడు పొలిటికల్ యాక్టివ్ గా లేరు. టీడీపీలో ఉన్నా..లేనట్లుగానే ఉంటున్నారు. ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బీజేపీలోకి అని కొన్ని సార్లు..కాదు వైసీపీలో చేరుతున్నారని కొన్ని సార్లు ప్రచారం సాగింది. గంటా మాత్రం తన రాజకీయ భవిష్యత్ మీద స్పష్టత మాత్రం ఇవ్వలేదు. గంటా టీడీపీలో కొనసాగుతారా లేదా అనే దానికి సమాధానంగా ఆయన ఈ రోజు పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

అవంతి వర్సెస్ గంటా... విశాఖలో వీరి రాజకీయ మంట .. అసలు రీజన్ ఇదేనా ? అవంతి వర్సెస్ గంటా... విశాఖలో వీరి రాజకీయ మంట .. అసలు రీజన్ ఇదేనా ?

కొద్ది రోజులుగా ఆయన టీడీపీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో..ఆయన టీడీపీలోనే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఆయన వ్యతిరేక శిబిరం మాత్రం టీడీపీలో గంటా ఎక్కవ కాలం కొనసాగరని..ఆయన వైసీపీలో చేరటానికి మంత్రాంగం నడుపుతున్నారని..అయితే కొన్ని కండీషన్లు అమలు చేయాల్సి ఉందని..దాని కారణంగానే ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.

 పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రి గంటా..

పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రి గంటా..

టీడీపీలో ఇస్టం లేక కొనసాగుతున్నారనే ప్రచారం ఎదుర్కొంటున్న గంటా పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యాలయం మెట్టు ఎక్కటం లేదు. అదే విధంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు కార్యక్రమాల కంటే చిరంజీవి కార్యక్రమాల్లో గంటా ఎక్కువగా కనిపిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా నియోకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి గంటా హాజరయ్యారు. దీని ద్వారా గంటా రాజకీయ ఉత్కంఠకు తెర దించారని..ఆయన టీడీపీలోనే కొనసాగుతారని స్థానిక టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 గంటా టీడీపీ వీడుతారని ప్రచారం..

గంటా టీడీపీ వీడుతారని ప్రచారం..

చాలా కాలంగా మాజీ మంత్రి గంటా టీడీపీ వీడుతారనే ప్రచారం సాగుతూనే ఉంది. ఆయన అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు అది గంటాకు కాదని..పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. దీంతో ఆయన మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది. ఇక, గంటా అటు టీడీపీ వీడుతారనే సమాచారంతోనే చంద్రబాబు పదవి ఇవ్వలేదని చెబుతున్నారు. గంటా వైసీపీలో వెళ్తారని కొందరు.. బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే..గంటా మాత్రం తాను పార్టీ వీడితే చెప్పిన తరువాతనే వీడుతానని గతంలో స్పష్టం చేసారు.

చిరంజీవితో గతం కంటే సన్నిహితంగా..

చిరంజీవితో గతం కంటే సన్నిహితంగా..

టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా సినీ హీరో చిరంజీవితో గతం కంటే సన్నిహితంగా మెలుగుతున్నారు. ప్రజారాజ్యంలో కలిసి పని చేసిన సన్నిహిత్యం ఉన్నా..టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో అంతగా కలిసిని సందర్భాలు లేవు. ఇక, జనసేన అధినేత పవన్ అనేక సందర్భాల్లో గంటా పైన రాజకీయంగా విమర్శలు చేసారు. ఇక దశలో గంటా జనసేనలో చేరాలని ప్రతిపాదిస్తే అందుకు పవన్ అంగీకరించలేదనే వార్తలు వచ్చాయి. అయితే, చిరంజీవి పుట్టిన రోజు సమయంలో..చిరంజీవి తాడేపల్లి గూడెం పర్యటనలోనూ గంటా ఆయన వెన్నంటే ఉన్నారు. చంద్రబాబు కార్యక్రమాల్లో కంటే చిరంజీవి కార్యక్రమాల్లో గంటా ఎక్కువగా కనిపిస్తున్నారనే వాదన ఉంది.

 వైసీపీలో రావాలని..అయితే ఆ కండీషన్లే అడ్డుగా..

వైసీపీలో రావాలని..అయితే ఆ కండీషన్లే అడ్డుగా..

గంటా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి రావటానికి మంతనాలు సాగాయని సమాచారం. ఎన్నికల ముందే గంటా వైసీపీలోకి వస్తారని అప్పట్లో విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, గంటా బీజేపీలోకి వెళ్లటం వలన ఉపయోగం లేదని..వెళ్తే వైసీపీలోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే..జగన్ చెప్పినట్లుగా ఎమ్మెల్యే పదవి వీడటానికి ఆయన సిద్దంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, స్థానిక మంత్రి అవంతితో పాటుగా.. గంటా కారనంగా గతంలో ఇబ్బంది పడిన వైసీపీ నేతలతో సర్దుబాటు చేసుకుంటే పార్టీలోకి రావటానికి ఇబ్బంది లేదని వైసీపీ నేతలు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఆయన ప్రస్తుతానికి ఉన్న పార్టీలోనే కొనసాగే విధంగా సర్దుబాటు ధోరణితో ముందుకు వెళ్తున్నారు.

English summary
Ex minister Ganta Srinivas Rao re entered into TDP office and attend co ordination meeting after long time. Since few months speculations ono Ganta he joining in YCP. But, With thie latest entry gant want to put full stop for these speculations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X