వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 17న డీసెట్‌... ఇంగ్లీష్ మీడియంలోనూ డీ ఎడ్ కోర్సులు‌:మంత్రి గంటా

|
Google Oneindia TeluguNews

అమరావతి:డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఎడ్‌)లో ప్రవేశం కోసం డీసెట్‌-2018 ని మే 17న ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై గురువారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి గంటా అనంతరం ప్రకటన విడుదల చేశారు.

ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 28న ఫలితాల విడుదల, జూన్‌ 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌, జూన్‌ 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 2018-19 నుంచి ఆంగ్ల మాధ్యమంలో డీఎడ్‌ కోర్సులు నిర్వహిస్తామని, అయితే ఇందుకు ఇంటర్‌ ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులే అర్హులని మంత్రి గంటా తెలిపారు.

ganta srinivasa rao announce ded 2018 examination may 17

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి జూన్‌ 7 వరకు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పౌర గ్రంథాలయ శాఖల ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఈ స్పెషల్ క్యాంప్ ల నిర్వహణ జరుగుతుందని మంత్రి గంటా వెల్లడించారు. ఈ క్యాంపుల్లో పుస్తక పఠనం, కథలు చెప్పడం, సమీక్షలు రాయించడం, చిత్రలేఖనం, సంగీతం, నాటికలు, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తారని మంత్రి వివరించారు.
English summary
Amaravathi:AP Education minister Ganta Srinivasarao announced that the D.ed Examination will be held on May 17. This test will be conducted through online method, minister said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X