వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 కాదు 16వ తేదీ: వైసీపీలో గంటా చేరికకు తేదీ ఫిక్స్, కండువా కప్పుకోవడంపై ఉత్కంఠ, అనుచరుడిగా..?

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీ తీర్థం పుచ్చుకునే తేదీ ఖరారయ్యింది. ఆయన టీడీపీ వీడతారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతుంది. కానీ చేరికపై మాత్రం రకరకాలు ఊహాగానాలు వినిపించాయి. తేదీ కూడా మారుతూ వచ్చింది. తొలుత ఆగస్ట్ 15వ తేదీ అని ప్రచారం జరగగా.. అదీ 9వ తేదీకి మారింది. ఇప్పుడు మరో అప్‌డేట్ వచ్చింది. అదే గంటా అండ్ కో వైసీపీలో చేరే తేదీపై స్పష్టత వచ్చింది. 16వ తేదీన గంటా వైసీపీలో చేరతారని విశ్వసనీయంగా తెలిసింది.

ఆగస్టు 9న వైసీపీలో గంటా చేరిక- టీడీపీ మాజీలు కూడా.. తెరవెనుక చక్రం తిప్పిన మెగాస్టార్ ? ఆగస్టు 9న వైసీపీలో గంటా చేరిక- టీడీపీ మాజీలు కూడా.. తెరవెనుక చక్రం తిప్పిన మెగాస్టార్ ?

16వ తేదీన చేరిక..?

16వ తేదీన చేరిక..?

ఈ నెల 16వ తేదీ ఆదివారం రోజున గంటా తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమవుతారు. అయితే ప్రస్తుతానికి గంటా.. వైసీపీ అనుచరుడిగా కొనసాగుతుండగా.. ఆయన అనుచరులు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరో 10 రోజులు ఆగాల్సిందే.

రెండుసార్లు మంత్రిగా..

రెండుసార్లు మంత్రిగా..

గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో.. గంటాకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవీ వరించింది. తర్వాత మారిన పరిస్థితుల్లో 2014కి ముందు టీడీపీలో చేరిపోయారు. ఏపీలో టీడీపీ విజయం సాధించగా.. గంటాకు మంత్రి మండలిలో చంద్రబాబు అవకాశం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖపట్టణం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచినా.. పార్టీ ఘోర పరాజయమైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలను అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

Recommended Video

ప్రజా వాగ్గేయకారుడు వంగపండు మృతికి CM Jagan సహా సంతాపాన్ని తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు !
ఏ పార్టీలో ఉన్నా సరే..

ఏ పార్టీలో ఉన్నా సరే..

గంటా ఏ పార్టీలో ఉన్నా సరే రాజకీయంగా ప్రాధాన్యం లభిస్తోంది. 1999లో అనకాపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవీ కూడా వరించింది. పీఆర్పీ నుంచి సీ రామచంద్రయ్యతో కలిసి మంత్రిగా పనిచేశారు. తర్వాత 2014లో టీడీపీలో చేరి.. తిరిగి మంత్రి పదవీ చేపట్టారు. ఇప్పుడు వైసీపీలోకి రావడంతో ఆయనకు జగన్ కూడా కీలక పదవీ ఇస్తారా.. లేదా అనే అంశం చర్చకొచ్చింది. అందుకోసమే ఆయన అనుచరుడిగా కొనసాగుతారా అనే ప్రశ్న వస్తోంది. మొత్తానికి ఏ రాజకీయ పార్టీలో ఉన్న గంటాకు.. మంచి పదవీ, పేరు ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

English summary
ex minister, tdp leader ganta srinivasa rao to be join ysrcp on august 16th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X