వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై కక్ష తీర్చుకోండి...నేను రెడీ.. ఆయన దేశ ద్రోహం చేశారా ? సిఐడీ తీరుపై గంటా శ్రీనివాసరావు

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నందకిషోర్ అరెస్టుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపై ఏమైనా కక్ష సాధించాలనుకుంటే తాను రెడీగా ఉన్నానని, కానీ అనవసరంగా తన సన్నిహితుడు నందకిషోర్ ను అరెస్ట్ చేయడం అన్యాయం అని పేర్కొన్నారు.

సిఐడీ కార్యాలయానికి గంటా శ్రీనివాసరావు .. కిషోర్ ను కలిసే యత్నం

సిఐడీ కార్యాలయానికి గంటా శ్రీనివాసరావు .. కిషోర్ ను కలిసే యత్నం

ఇక నేడు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో సిఐడి అధికారులు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడైన నందకిషోర్ ను అరెస్ట్ చేసి సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సిఐడి అధికారుల అదుపులో ఉన్న తన సన్నిహితులు నందకిషోర్ కలిసేందుకు అనుమతించాలని ఆయన కోరారు.అయితే విచారణ జరుగుతుందంటూ పేర్కొన్న సిఐడి అధికారులు గంటా శ్రీనివాసరావు కార్యాలయంలోకి అనుమతించలేదు.

నందకిషోర్ ఏమైనా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? ప్రశ్నించిన గంటా

నందకిషోర్ ఏమైనా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? ప్రశ్నించిన గంటా

ఇక ఈ వ్యవహారంపై గంటా శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నందకిషోర్ విషయంలో సిఐడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. నందకిషోర్ ఏమైనా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? రక్షణ వ్యవహారాలను లీక్ చేశారా? ఏమైనా దొంగతనాలు చేశారా ? అని ప్రశ్నించిన ఆయన కేవలం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయిన మెసేజ్ ను షేర్ చేసినట్లుగా పేర్కొన్నారు.

తనపై కక్షతో వారిని ఇబ్బంది పెడతారా ?

తనపై కక్షతో వారిని ఇబ్బంది పెడతారా ?

ఇక చాలామంది వేల కొద్దీ మెసేజ్లను షేర్ చేస్తున్నారని పేర్కొన్న గంటా శ్రీనివాసరావు పోలీసులు మఫ్టీలో వెళ్లి మరి అరెస్టు చేయాల్సిన అంత పెద్ద సమస్య ఇది కాదు అని వ్యాఖ్యానించారు. ఇక తాను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ లో కూడా ఎక్కడ ఎవరి పేరు వ్యక్తం చేయబడలేదు అని పేర్కొన్న గంటా శ్రీనివాసరావు నాపై ఉన్న కక్షతో నా సన్నిహితులను ఇబ్బంది పెడతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Recommended Video

Atchennaidu కి 14 రోజుల రిమాండ్, Remand Report లో ఆసక్తికర విషయాలు..!!
చీప్ ట్రిక్స్ ప్లే చేసే అలవాటు లేదన్న గంటా

చీప్ ట్రిక్స్ ప్లే చేసే అలవాటు లేదన్న గంటా

మిత్రుడిని తీసుకెళ్తుంటే బాధగా ఉందని పేర్కొన్న గంటా శ్రీనివాసరావు రాజకీయంగా దేనినైనా ఎదుర్కొంటాం కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే అలవాటు లేదు అంటూ మాట్లాడారు. కేవలం మెసేజ్ ఫార్వర్డ్ చేశారని 68 ఏళ్ల వయసున్న నలంద కిషోర్ అరెస్టు చేయడం సరికాదని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇక అంతే కాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి అరెస్టులపై పునరాలోచించాలి అంటూ పేర్కొన్నారు గంటా శ్రీనివాసరావు.

English summary
Former minister TDP MLA Ganta Srinivasarao expresses deep embarrassment over Nandakishore's arrest. He said that he was ready if ycp government wants to to take any faction against him, but it was unfair to arrest his friend Nandakishore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X