
స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడ్ని తన స్థానంలో నిలబెడతానన్న గంటా .. కేటీఆర్ విశాఖ రాకపైనా ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు స్పీకర్ తమ్మినేని సీతారాం ను కలిశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు తమ్మినేని సీతారాం ను కలిసిన అనంతరం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ
ఉక్కుపై
ప్రధాని
మోడీకి
లేఖలు
రాసిన
చంద్రబాబు
..
వైసీపీకి
షాక్
ఇచ్చారుగా
!!

తాను రాజీనామా చేసిన స్థానంలో తిరిగి పోటీ చెయ్యనన్న గంటా
తాను రాజీనామా చేసిన స్థానంలో తిరిగి పోటీ చేయనని చెప్పిన గంటా శ్రీనివాసరావు, ఆ స్థానంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడ్ని నిలబెడతానని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారని, అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సీనియారిటీని సైతం పక్కనపెట్టి జగన్ తో కలిసి నడుస్తానని చెప్పారని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల అనంతరం విశాఖకు వస్తారు
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము కూడా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ నగరానికి వస్తారని గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గంటా శ్రీనివాస్ ఇప్పటికే కేటీఆర్ తో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించడంపై గంటా శ్రీనివాస్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక ఉద్యమంలో పాల్గొనటానికి కేటీఆర్ విశాఖకు రావాలని ఆహ్వానించారు. దీనిపై సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కేటీఆర్ వెల్లడించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణకోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామన్న గంటా
విశాఖ
ఉక్కు
పరిరక్షణకోసం
నాన్
పొలిటికల్
జేఏసీ
ఏర్పాటు
చేస్తామని
పేర్కొన్న
గంటా
శ్రీనివాస్
తాను
మాత్రమే
కాదు
విశాఖ
స్టీల్
ప్లాంట్
పరిరక్షణకోసం
అందరూ
రాజీనామాల
బాట
పట్టాల్సి
ఉందని
అభిప్రాయపడుతున్నారు.
ఎలాగైనా
కేంద్రం
స్టీల్
ప్లాంట్
ప్రైవేటీకరణ
ఉపసంహరించుకునే
నిర్ణయం
తీసుకునే
వరకు
అందరూ
కలిసి
పోరాటం
చేయాలని
గంటా
శ్రీనివాస్
పేర్కొన్నారు.
ఇంతకు
ముందు
నుండీ
ఆయన
స్టీల్
ప్లాంట్
పరిరక్షణ
కోసం
ఎంపీలు
,ఎమ్మెల్యేలు
రాజీనామాలు
చెయ్యాలని
డిమాండ్
చేస్తూ
వచ్చారు
.