వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా వ‌ర్సెస్ అవంతి : వైసిపిలోకి రావాల‌ని గంటా ప్ర‌య‌త్నించారు : ల‌క్ష మెజార్టీతో గెలుస్తా..!

|
Google Oneindia TeluguNews

మంత్రి గంటా శ్రీనివాస రావు వైసిపి లోకి రావాల‌ని త‌న కంటే ముందుగానే ప్ర‌య‌త్నాలు చేసార‌ని తాజాగా టిడిపి నుండి వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసిపి లో రావ‌టానికి చాలా మంది సిద్దంగా ఉన్నార‌ని అయితే, పార్టీ లో ఖాళీలు లేవ‌ని అవంతి చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో తాను భీమిలి నుండి లక్ష మెజార్టీతో గెలుస్తాన‌ని గంటా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

గంటా ముందుగానే ప్ర‌య‌త్నాలు..
టిడిపి ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉంటూనే వైసిపి లోకి వ‌చ్చేందుకు గంటా ప్ర‌య‌త్నాలు చేసార‌ని అవంతి శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసిపి నుండి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నేది ఆయ‌న ఉద్దేశం అని వివ‌రించారు. అయితే, తాను వైసి పిలో చేర‌టం..భీమిలి నుండి పోటీ చేస్తుండ‌టంతో గంటా కు అవ‌కాశం ద‌క్క‌లేద‌ని అవంతి వివ‌రించారు. ఆదే స‌మ‌యం లో గంటా విశాఖ‌లో మాట్లాడుతూ తాను రాజ‌కీయాల్లో ఉంటే టిడిపిలోనే ఉంటాన‌ని..పార్టీ మారాల్సి వ‌స్తే రాజ‌కీయాల‌ను మానేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి నుండే పోటీ చేసి ల‌క్ష మెజార్టీతో గెలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసా రు. ఇత‌రుల గురించి మాట్లాడి త‌న స్థాయి త‌క్కువ చేసుకోన‌ని చెప్పుకొచ్చారు.

Ganta tried for join YCP : many leaders ready join in Party..

టిడిపి లో ఉన్న క‌ర్మ అదే
టిడిపి లో ఏ కులం వారిని అదే కులం వారితో తిట్టిస్తార‌ని..అందు కోసం ఆ సైన్యం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంద‌ని అవం తి విమ‌ర్శించారు. ఎస్సీల‌ను ఎస్సీ నేత‌ల‌తో..కాపుల‌ను కాపు నేత‌ల‌తో తిట్టిస్తార‌ని వివ‌రించారు. ఇక‌, వైసిపి లో చేర‌టానికి చాలా మంది టిడిపి నేత‌లు సిద్దంగా ఉన్నార‌న్నారు. అయితే వైసిపి లో ఖాళీలు లేవ‌ని చెప్పుకొచ్చారు. టిడిపి నుండి అనేక మంది ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పారు. తాజాగా, అమ‌లాపురం ఎంపి పండుల ర‌వీంద్ర‌బాబును అవంతి శ్రీనివాస్ వెంట బెట్టుకొని జ‌గ‌న్ వద్ద‌కు తీసుకొచ్చారు.

English summary
Ganta Vs Avanthi. Bhimili politics become more hot in Visakha dist. Avanthi says Ganta tried to join in YCP before him. Now many tdp leaders ready to join in YCP..but, no vacancy in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X