కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

"భయపెట్టి లొంగదీసుకున్నాడు, ఇతరుల వద్దకూ పంపించాడు"

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దుస్తుల పరిశ్రమ యజమాని భయపెట్టిన తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని ఓ యువతి ఆరోపించింది. తన తల్లిదండ్రులు మరణించారని, దాంతో దిక్కులేక బతుకుదెరువు కోసం ఓ దుస్తుల పరిశ్రమకు ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పారు.

దుస్తుల పరిశ్రమ యజమానిని భయపెట్టి తనను లొంగదీసుకున్నాడని 19 ఏళ్ల యువతి ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించింది. ఆమె చెప్పిన వివరాలు ఈ కింది విదంగా ఉన్నాయి.

ఇలా పనిలో కుదిరింది

ఇలా పనిలో కుదిరింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కో చైర్మన్ శ్రీనివాస్ తండ్రి రామకృష్ణ (65) కడపలో దుస్తుల పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం కోసం నాలుగు నెలల క్రితం ఆమె పరిశ్రమకు వెళ్లింది. అతను ఆమెను పనిలో పెట్టుకున్నాడు.

భయపెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు

భయపెట్టి ఆమెను లొంగదీసుకున్నాడు

కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆయనతో గడిపిన సందర్భాలను వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరిస్తూ ఇతరుల వద్దకు కూడా ఆమెను పంపతూ వచ్చాడు. తట్టుకోలేక ఆమె పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది.

ఎస్ఐ ఇలా చేశాడు

ఎస్ఐ ఇలా చేశాడు

డిసెంబర్‌లో తాను కడప వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అక్కడ ఎస్ఐ తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని రూ.50 వేలు ఇస్తాడు, విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని బెదిరించాడని ఆమె చెప్పింది.

ఇతర అమ్మాయిలను సైతం...

ఇతర అమ్మాయిలను సైతం...

రామకృష్ణ ఇలా పలువురు అమ్మాయాలను లొంగదీసుకున్నాడని, ఇక ముందు ఏ అమ్మాయికి కూడా ఇలా జరగకూడదని కేసు పెట్టాలని ప్రయత్నిస్తే పట్టించుకోలేదని ఆ యువతి చెప్పింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉందని, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్టాడుతున్నాడని యువతి వివరించింది. రామకృష్ణ వ్యవహారానికి సంబంధించిన వీడియోలను ఆమె మీడియా ప్రతినిధులకు ఇచ్చింది.

English summary
A 19 year old girl alleged that garment company owner resorted to sexual assault on her at kadapa in Andhra Prdesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X