వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గరుడ వారధి ఫ్లై ఓవర్ నిర్మాణానికి బ్రేక్, నామాల విషయంలో ఆగమశాస్త్రం ప్రకారమే: వైవీ సుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్మిస్తోన్న గరుడ వారధి ఫ్లై ఓవర్ నిర్మాణానికి బ్రేక్ పడింది. ఫ్లై ఓవర్ డిజైన్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. ఫ్లై ఓవర్‌పై నామాల విషయంలో ఆగమశాస్త్ర సలహాదారుల అభిప్రాయం మేరకే ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఫ్లై ఓవర్‌పై ఇప్పుడే నామాలు పెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫ్లై ఓవర్‌‌కు సంబంధించి నామాలు ఖరారయ్యాకే తిరిగి పనులు ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు.

అంతా మీరే చేశారు..

అంతా మీరే చేశారు..


గరుడ వారధి ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే నామాల విషయంలో గందరగోళం నెలకొందని హింట్ ఇచ్చారు. గరుడ వారధి ఫ్లై ఓవర్‌లో మార్పులు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. గరుడ వారధిపై వాహనాలు వెళతాయని.. ఇది భక్తుల సెంటిమెంట్‌తో కూడుకున్న విషయమని పేర్కొన్నారు.

రద్దీ నేపథ్యంలో..

రద్దీ నేపథ్యంలో..

తిరుమ‌ల‌ను సంద‌ర్శించ‌డానికి ప్ర‌పంచం నలుమూల‌ల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు భ‌క్తులు. ఇందుకోసం భారీ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తిరుపతి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ అధికారులు. కానీ నామాలపై క్లారిటీ రాకపోవడంతో కాస్త బ్రేక్ ఇచ్చారు.

బ్రేక్..

బ్రేక్..


తిరుప‌తిలో అత్యంత ర‌ద్దీ మార్గాల్లో ఒకటి అలిపిరి రోడ్‌. రేణిగుంట వైపు నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే ఈ మార్గంలోనే ఈ కారిడార్‌ను నిర్మించేందుకు పనులు చేపట్టారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. టీటీడీ బ్రేక్ నిచ్చింది.

English summary
garuda varadi fly over construction break ttd chairman yv subba reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X