విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ లీకేజీ: పాలిమర్స్ కంపెనీ వద్ద మోగిన సైరన్, పోలీసులు అలర్ట్, కాపలా ఉన్న యువకుల తరలింపు

|
Google Oneindia TeluguNews

విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద మరోసారి గ్యాస్ లీకేజీ కలకలం నెలకొంది. పాలిమర్స్ కంపెనీ వద్ద రాత్రి సైరన్ మోగింది. దీంతో వెంటనే పోలీసులు పరుగులు తీశారు. ఇప్పటికే కంపెనీ సమీపంలో గల ఐదు గ్రామాల ప్రజలను తరలించిన సంగతి తెలిసిందే. అయితే స్థానికుల ఇళ్లలో కొందరు యవకులను కాపలా పెట్టారు. వారు ఆరుగుమీద పడుకొన్నారు.

gas fumes begin leaking again, nearby villages evacuate..

సైరన్ మోగడంతో పోలీసులు వెంటనే యువకులను అక్కడినుంచి తరలిస్తున్నారు. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొందరు యువకులు గోపాలపట్నం షాపుల అరుగుమీద కూడా కనిపించారు. వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. పొగ రావడంతో ఘటనాస్థలానికి 110 ఫైరింజన్లు, 2 ఫోమ్ టెండర్లు చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహకారంతో 50 మంది సిబ్బంది గ్యాస్ నియంత్రించే చర్యలు చేప్టాయి. 3 కిలోమీటర్ల పరిధిలో అందరినీ పంపిస్తున్నామని విశాఖ అగ్నిమాపక అధికారి సందీప్ ఆనంద్ తెలిపారు. స్టెరిన్ గ్యాస్ లీకై.. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 250 మంది వరకు చికిత్స అందిస్తున్నారు.

Recommended Video

Vizag Gas Leak: PM Modi Assures All Help To Andhra CM

ప్రమాదంలో చనిపోయిన పది మంది మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. కమిటీ నివేదిక ఆధారంగా సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కంపెనీ తప్పు చేసినట్లైతే చర్యలు తప్పవని ఏపీ పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా స్పస్టంచేసిన సంగతి తెలిసిందే.

English summary
10 more fire tenders, including 2 foam tenders, are present at the spot. Ambulances are ready for any emergency Visakhapatnam District Fire Officer Sandeep Anand said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X