వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోరాట స్ఫూర్తినింపిన గౌతమ్ సవాంగ్: కంటికి రెప్పలా: ఐరాస మహిళా పోలీస్ బాస్: జాంబియా నుంచి

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌కు ఓ అరుదైన కితాబు లభించింది. గౌతమ్ సవాంగ్ తనలో పోరాట స్ఫూర్తినింపారని, ధైర్యాన్ని నింపారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ మహిళా పోలీసు అధికారిణి ప్రశంసించారు. కంటికి రెప్పలా చూసుకున్నారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి నుంచి ఈ ఏడాది అత్యుత్తమ మహిళా పోలీసు అధికారిణిగా నిలిచారామె. పేరు డొరీన్ మజుబా మలాంబో. జాంబియాకు చెందిన టాప్ క్యాడర్ పోలీస్. డెప్యుటేషన్ మీద ఆమె ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నారు. శాంతి బలగాలకు సారథ్యాన్ని వహిస్తున్నారు.

ఎలా పరియయం?

ఎలా పరియయం?

ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి జాంబియా. ఆ ఇద్దరు పోలీసు బాస్‌లకు పరిచయం ఎలా ఏర్పడింది. తన జూనియర్‌లో పోరాట స్ఫూర్తిని గౌతమ్ సవాంగ్ ఎలా నింపగలిగారు? దీనికి సమాధానం- ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు గౌతమ్ సవాంగ్. 2009-2012 మధ్యకాలంలో ఆయన డెప్యుటేషన:మీద ఐక్యరాజ్య సమితికి వెళ్లారు. కల్లోల లైబీరియాలో ఐరాస శాంతి బలగాలకు సారథ్యాన్ని వహించారు. అదే సమయంలో ఐరాస శాంతి బలగాల తరఫున జాంబియా నుంచి మలాంబో లైబీరియాకు వెళ్లారు. గౌతమ్ సవాంగ్ వద్ద జెండర్ అడ్వైజర్‌గా పనిచేశారు.

దక్షిణ సూడాన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ..

దక్షిణ సూడాన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ..

నాలుగు రోజుల కిందటే ఆమె ఐక్యరాజ్య సమితి విమెన్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్‌గా నియమితులు అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా ఆమె స్ట్రాట్ న్యూస్ గ్లోబల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మీడియా ప్రతినిధి అమితాబ్ పీ రెవితో మాట్లాడారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో భారత్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ కారణమని అన్నారు. తాను సాధించిన ఈ ఘనతలో ఆయనకు భాగం ఉందని చెప్పారు.

తొలిసారిగా..

తొలిసారిగా..

ఓ మహిళా పోలీస్అధికారిగా తాను తొలిసారిగా లైబీరియాకు వెళ్లానని, గౌతమ్ సవాంగ్ సారథ్యంలో పని చేశానని మలాంబో చెప్పారు. శాంతి పరిరక్షక బలగాలుగా వేర్వేరు దేశాలకు చెందిన మహిళా పోలీసు అధికారులను ఎంపిక చేయడం అదే తొలిసారి అని, తొలి బ్యాచ్‌లో తానూ ఉన్నానని అన్నారు. లైబీరియాలో తనను గౌతమ్ సవాంగ్ వద్ద సలహాదారుగా నియమించారని, తొలిసారి లైబీరియా వంటి కల్లోల ప్రాంతానికి వెళ్లిన తనలో ఆయన ధైర్యాన్ని నింపారని చెప్పారు. తనను కంటికి రెప్పలా చూసుకున్నారని ప్రశంసించారు. అనేక మెళకువలను ఆయన వద్ద నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.

English summary
UN Woman Police Officer Of The Year Zambia’s Doreen Malambo told that Indian Top Cop Gautam Sawang ‘Nurtured Me, Gave Me Courage’: Gautam Sawang is the current DGP of Andhra Pradesh. Police Commissioner in the United Nations Mission in Liberia from 2009 to 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X