వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గౌతమీపుత్ర శాతకర్ణి': చంద్రబాబును బయటపడేసిన కేసీఆర్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్.. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విషయంలో గట్టున పడేశారా? అంటే అవుననే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విషయంలో గట్టున పడేశారా? అంటే అవుననే అంటున్నారు.

<strong>అదీ మా పాలసీ: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కేసీఆర్ బంపరాఫర్, బాలకృష్ణ స్పందన </strong>అదీ మా పాలసీ: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కేసీఆర్ బంపరాఫర్, బాలకృష్ణ స్పందన

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలోను వినోదపు పన్ను మినహాయించారు. మొదట తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాతే ఏపీ ప్రభుత్వం మినహాయించింది.

తొలుత చంద్రబాబు దీనికి మినహాయింపు ఇచ్చి ఉంటే

తొలుత చంద్రబాబు దీనికి మినహాయింపు ఇచ్చి ఉంటే

విమర్శలపాలయ్యేవారని అంటున్నారు. ఇప్పటికే వైసిపి, కాంగ్రెస్ పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ చిన్న అంశం దొరికినా వదలడం లేదు.

విమర్శలు వచ్చేవి

విమర్శలు వచ్చేవి

తెలంగాణ మినహాయింపు ఇవ్వకముందే లేదా ఇవ్వకుంటే.. ఏపీ మాత్రమే ఇస్తే.. బావమరిది సినిమాకు పన్ను మినహాయించారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చేవని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ మినహాయించిన అనంతరం చంద్రబాబు మినహాయించారు.

కేసీఆర్ తర్వాత

కేసీఆర్ తర్వాత

బాలకృష్ణ.. కేసీఆర్‌ను కలవడం, పన్ను మినహాయించడం అంతా ఓ రోజులో జరిగిపోయింది. చారిత్రక సినిమాలకు పన్ను మినహాయింపు తమ ప్రభుత్వం విధానంగా పెట్టుకుందని కేసీఆర్ అదే రోజు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు ఏపీలో మినహాయింపు జరిగింది.

గతంలో పోటాపోటీ

గతంలో పోటాపోటీ

గతంలో, ఉద్యోగుల జీతాల నుంచి ఆర్టీసీ ఉద్యోగుల జీతాల వరకు ప్రతి విషయంలో చంద్రబాబు - కేసీఆర్‌లు పోటీ పడ్డారు. ఉద్యోగుల జీతాలు ఒకరిని చూసి మరొకరు, ఒకరికి మించి మరింత ఎక్కువ పెంచారనే వాదనలు ఉన్నాయి. పలు విషయాల్లో సీఎంలు పోటీ పడ్డారు.

తెలంగాణ తర్వాత ఏపీ

తెలంగాణ తర్వాత ఏపీ

అయితే, ఓటుకు నోటు అనంతరం విభేదాలు వచ్చినా, ఆ తర్వాత ఇరువురు సీఎంలు కలిసిపోయారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాకు తొలుత కేసీఆర్, ఆ తర్వాత చంద్రబాబు పన్ను మినహాయించడం పైనా చర్చ సాగుతోంది. ఏదైనా మతలబు ఉందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసిపి లేదా కాంగ్రెస్ పార్టీ విమర్శల నుంచి చంద్రబాబును కేసీఆర్ కాపాడారని అంటున్నారు.

English summary
Telangana KCR saves AP Chandrababu Naidu in Balakrishna's film issue!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X