వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదా గిఫ్ట్: గీత, ధనవంతులవి కూల్చాలని మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geeta Reddy lashes out at MLCs, who joined TRS
హైదరాబాద్: పార్టీని వీడిన వారి పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గీతా రెడ్డి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఎమ్మెల్సీలు ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. 10 జనపథ్ మనిషిని అని చెప్పుకునే ఆమోస్ ఎందుకు తెరాసలో చేరారన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్సీల పైన అనర్హత వేటు వేయాలని పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గీతా రెడ్డితో పాటు డీకే అరుణ కూడా మాట్లాడారు. అభధ్రతా భావంతోనే తెరాస వలసలను ప్రోత్సహిస్తోందన్నారు.

అటు పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా దీనిపై స్పందించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమనన్నారు. ఒకేరోజు మూడు పార్టీలు మారినవారున్నారన్నారు. అయితే, రాజకీయ నాయకులు స్థిరత్వం ఉండాలని, ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉంటారన్నారు. పార్టీలు మారితే సదరు పార్టీకి సంఖ్యాబలం పెరుగుతుంది తప్ప ఒరిగేదేమి లేదన్నారు. మాజీ మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ.. వలసలను ప్రోత్సహించడం తెరాసకే నష్టమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ సత్తా చూపిస్తామన్నారు.

ధనవంతుల కట్టడాలు కూడా కూల్చండి: మోత్కుపల్లి

గురుకుల్ ట్రస్ట్ భూముల్లో కేవలం పేదవారి ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారని... ధనవంతుల కట్టడాలను మాత్రం వదిలేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్శింహులు తెరాస ప్రభుత్వానికి సూచించారు. చిత్తశుద్ధి ఉంటే ధనవంతుల కట్టడాలను కూడా కూల్చాలన్నారు. ట్రస్టుకు సంబంధించిన భూముల్లోని నిర్మాణాలన్నింటినీ తొలగించి.. పేదలకు వంద గజాల చొప్పున పంచాలన్నారు.

English summary

 Former Minister Geeta Reddy lashes out at MLCs, who joined TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X