వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: రిజైన్‌కు సిద్ధపడ్డ గీతా, చూద్దామన్న సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో తనపై సిబిఐ అభియోగాలు నమోదు చేయడంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతా రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. సిబిఐ మంగళవారం రెండు ఛార్జీషీట్స్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అందులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశంలో గీతా రెడ్డిని ఎ9 నిందితురాలిగా సిబిఐ పేర్కొంది. దీంతో గీతా రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ వస్తే కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో గీతా రెడ్డి కూడా ఉన్నారు. జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు నమోదు కావడంతో గతంలో సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆమె మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, అభియోగ పత్రాన్ని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి ఆమెకు సర్ది చెప్పారట.

బెయిల్ పైన మోపిదేవి విడుదల

వాన్‌పిక్ భూముల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మంగళవారం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. మోపిదేవి గత కొంతకాలంగా మెడ, వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం సిబిఐ కోర్టు 45 రోజుల మధ్యంతర బెయిల్‌ను సోమవారం సాయం త్రం మంజూరు చేసింది.

మంగళవారం బెయిల్ పత్రా లు జైలు అధికారులకు చేరడంతో మోపిదేవిని విడుదల చేశారు. మోపిదేవి విడుదల సందర్భంగా జైలు వద్దకు అతని అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. శస్త్రచికిత్స కోసం మోపిదేవి బుధవారం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

English summary
Major Industries Minister Geetha Reddy offered to 
 
 resign on Tuesday after the CBI named her as an 
 
 accused in the YS Jaganmohan Reddy DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X