మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రీన్ సిగ్నల్: రాజకీయాల్లోకి గీతా రెడ్డి కూతురు.. కానీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geeta Reddy
మెదక్: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు గీతా రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చుననే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున జహీరాబాద్ నియోజకవర్గంలో మేఘన విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. మంత్రి గీతా రెడ్డి ఏకైక కుమార్తె మేఘన ఆమె రాజకీయ వారుసురాలన్నది నిర్వివాదాంశం. దీంతో ఆమె రాజకీయ రంగప్రవేశం కూడా అనివార్యంగానే మారిందని అభిప్రాయపడుతున్నారు.

ఇందుకు మేఘన తండ్రి, భర్తల సమ్మతి తోడవడంతో ఆమె రాజకీయ ప్రవేశం స్థానిక ఎన్నిల ప్రచారంతో శ్రీకారం చుట్టిందంటున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని నియోజకవర్గంతో పాటు మున్సిపల్ ప్రచారాల దృష్ట్యా త్వరలో ఎమ్మెల్యే బరిలోకి కూతుర్ని దింపవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, 2014లో కాకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మొదట మున్సిపల్ చైర్మన్ పదవి మహిళలకు రిజర్వుచేయడంతో మున్సిపల్ బరిలోనే రాజకీయ ప్రవేశం చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి.

English summary
It is said that former Minister Geeta Reddy daughter may join politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X