వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఘటనపై మనస్తాపం: గీతారెడ్డి రాజీనామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదహరాబాద్: ఢిల్లీ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి జె. గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీభవన్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి వెళ్లినప్పుడు జరిగిన సంఘటనతో రాష్ట్ర మంత్రి గీతారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బుధవారం మౌన దీక్ష కోసం జంతర్‌మంతర్‌కు బయలు దేరిన ముఖ్యమంత్రిని నిలువరించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా మంత్రుల పట్ల భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల గీతారెడ్డి బాధపడ్డారు.. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ జరగలేదని ఆమె ఆవేదనలో మునిగారు. ఇంత జరిగిన తర్వాత కూడా మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, రాష్ట్రపతి సైతం ఘటనపై విచారణ వ్యక్తంచేసినా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కనీస మర్యాదకైనా మహిళా మంత్రులను సంప్రదించి విచారం వ్యక్తం చేయకపోవడాన్ని తెలంగాణ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఆ సంఘటనపై, తాను రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై గీతారెడ్డి ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో మాట్లాడారు. బుధవారం నాటి ఘటనతో తాను మనస్తాపానికి గురయ్యానని ఆమె ఆంధ్రజ్యోతితో అన్నారు. ఇంకా మంత్రి పదవిలో కొనసాగరాదని పలువురు నేతలు, నియోజకవర్గ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న మాట కూడా వాస్తవమేనని వివరించారు.

దీనిపై అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీలో సీనియర్ నాయకురాలిగా తనను చూసిన వెంటనే కిరణ్ బస్సు దిగుతారని, తమతో మాట్లాడతారని ఊహించామని, కానీ ఇందుకు భిన్నంగా జరిగిందని అన్నారు.

English summary
According to media reports - J Geetha Reddy has decided to resign from CM Kiran kumar reddy's cabinet expressig protest against Delhi incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X