వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితో పొత్తుపై గంటా తీవ్ర వ్యాఖ్యలు: తెగదెంపులకు చంద్రబాబు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: బిజెపితో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మంత్రులు గంటాతో పాటు నారాయణ, పరిటాల సునీత కొల్లు రవీంద్ర, తదితరులు గురువారం బంద్‌లో పాల్గొన్నారు.

తమ తమ ప్రాంతాల్లో మంత్రులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఆమోదం ఉంటే తప్ప వీరంతా అలా చేయరనేది అందరికీ అర్థమయ్యే విషయమే. బిజెపితో తెగదెంపులకు చంద్రబాబు మానసికంగా సిద్ధపడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

పొత్తును వదులుకుంటామని గంటా

పొత్తును వదులుకుంటామని గంటా

అవసరమైతే బిజెపితో పొత్తును వదులుకుంటామని గంటా శ్రీనివాస రావు అన్నారు. చంద్రబాబు తెగదెంపులకు సిద్ధపడినట్లు సంకేతాలు ఇస్తే తప్ప మంత్రి అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయరనేది స్పష్టం. మిత్రధర్మాన్ని బిజెపి కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంంపై సవతి తల్లి ప్రేమ

రాష్ట్రంంపై సవతి తల్లి ప్రేమ

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని గంటా శ్రీనివాస రావు విమర్శించారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎంతో ఇచ్చిన కేంద్రం తమ రాష్ట్రానికి మాత్రం ఏమీ ఇవ్వడం లేదని ఆయన అన్నరు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు.

 కేంద్రం పూర్తిగా విఫలం

కేంద్రం పూర్తిగా విఫలం

విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు.

చంద్రబాబు ఇలా భావిస్తున్నారా...

చంద్రబాబు ఇలా భావిస్తున్నారా...


రాష్ట్రానికి ఇవ్వలేదనే విమర్శలు తలెత్తిన నేపథ్యంలో బిజెపితో ఇంకా స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పుకుంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుందనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బంద్‌లో పాల్గొనాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

English summary
Andhra Pradesh CM Nara Chandrabab Naidu has prepared to break alliance with BJP. Ghanta Srinivas Rao made serious comments on alliance with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X