వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై గౌరవం ఉంది, విలువ ఇస్తాం: మంత్రి గంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/ చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తమకు గౌరవం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ అభిప్రాయాలకు ప్రభుత్వం విలువ ఇస్తుందని తెలిపారు.

బాక్సైట్ తవ్వకాలపై 16వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. డిసెంబర్ 25 నుంచి 27 వరకు విశాఖ, అరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విమ్స్‌తో సహా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నామని గంటా వెల్లడించారు.

Ghanta says Pawan Kalyan opinion will be honoured

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డులో రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు 10 శాతం కమిషన్ ఇవ్వడాన్ని రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆయన గురువారంనాడు చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో పర్యటించారు.

ఆ తర్వాత మార్కెట్ యార్డులో అధికారులు, రైతులతో సమావేశమయ్యారు. ఎక్కడా లేని విధంగా మదనపల్లె మార్కెట్ యార్డులో పది శాతం దోపిడీ సాగుతోందని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలోని ఉద్యాన వన పంటల విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాల నుంచి 6.50 లక్షల ఎకరాలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మదనపల్లె మార్కెట్ యార్డును మరింత ఆధునీకరించడంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Andhra Pradesh minister Ghanta Srinivas Rao said that Jana Sena chief Pawan Kalyan opinion will be honoured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X