వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ సెకండియర్: ఎపిలోనూ బాలికలదే హవా

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఫలితాలను కర్నూలులో విడుదల చేశారు. ఇంటర్‌ పరీక్షల్లో మొత్తం 72.07 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 1.19 శాతం ఉత్తీర్ణత పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 74.80 కాగా, అబ్బాయిలు 69.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రతీ సంవత్సరంలాగే అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏబీసీడీ గ్రేడులుగా మార్కుల మెమోను ఇవ్వనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

ghanta srinivas rao

ఇంటర్‌ పరీక్షల్లో కృష్ణా జిల్లా(83 శాతం) మొదటి స్థానంగా నిలవగా, కడప జిల్లా(60 శాతం) చివరి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా ఏడో స్థానంలో(62శాతం) నిలిచింది. వచ్చే నెల 2 నుంచి కాలేజీల్లో మెమోలు ఇవ్వనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

మే 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అందుకు మే 5లోగా దరాఖాస్తులు చేసుకోవాల్సిందిగా మంత్రి చెప్పారు.

English summary
Andhra Pradesh minister Ghanta srinivas rao has released Andhra Pradesh intermediate second yera results at Kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X