వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: చెప్పినట్టుగానే టిడిపికి అన్నా రాంబాబు రాజీనామా

ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కార్యకర్తలతో తన అనుచరులతో గిద్దలూరులో శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ నెల 4వ, తేదిన కీలకమైన ప్రకటన చేస్తానని ఆయన ఇదివరకే ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టిడిపికి రాజీనామా చేశారు. ప్రకటించినట్టుగానే ఆగష్టు 4వ, తేదిన సంచలన ప్రకటన చేస్తానని చెప్పిన అన్నా రాంబాబు టిడిపికి గుడ్‌బై చెప్పారు. తన అనుచరులతో సమావేశమైన తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

తన అనుచరులతో గిద్దలూరులో శుక్రవారం నాడు అన్నా రాంబాబు సమావేశమయ్యారు. ఈ నెల 4వ, తేదిన కీలకమైన ప్రకటన చేస్తానని ఆయన ఇదివరకే ప్రకటించారు. అయితే టిడిపిని వీడి ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కార్యకర్తల సమావేశంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకొన్నారు

కరణం, జనార్థన్‌ల మధ్య ఆసక్తికరం: ఆత్మాభిమానాన్ని చంపుకోను, చెప్పుడు మాటలు వింటారుకరణం, జనార్థన్‌ల మధ్య ఆసక్తికరం: ఆత్మాభిమానాన్ని చంపుకోను, చెప్పుడు మాటలు వింటారు

ప్రకాశం జిల్లాలో టిడిపి నేతల మధ్య సమన్వయం లేదు. గిద్దలూరు నుండి వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆశోక్‌రెడ్డి 2016లో టిడిపిలో చేరారు. అయితే దీంతో మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత అన్నా రాంబాబుకు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య పొసగడం లేదు.

Giddalur former mla Anna Rambabu quits tdp?

ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?

పార్టీలో రెండు వర్గాలను సమన్వయం చేసేందుకు నాయకత్వం ప్రయత్నిస్తోన్నా ఆశించిన ప్రయోజనం కన్పించడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలుమార్లు రెండువర్గాలు బహిరంగంగానే విమర్శలు చేసుకొన్నాయి.అయితే కీలక ప్రకటన చేస్తానని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అయితే గతంలోని ప్రకటనకు ఇవాళ చేసే ప్రకటనకు తేడా ఉంటుందని అన్నా రాంబాబు వర్గీయులు చెబతున్నారు.

నియోజకవర్గంలోని పలు గ్రామాలనుండి రాంబాబు అనుచరులు ర్యాలీగా గిద్దలూరుకు చేరుకొన్నారు. గిద్దలూరులోని మార్కెట్‌యార్డులో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆశోక్‌రెడ్డి టిడిపిలో చేరిన సమయం నుండి పార్టీలో నెలకొన్న ఇబ్బందులపై ఆయన చర్చించనున్నారు. ఈ విషయమై పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయిందనే అభిప్రాయం అన్నా రాంబాబు వర్గీయుల్లో నెలకొంది.మరికొందరు అసంతృప్త నేతలు కూడ పార్టీ నుండి బయటకు వెళ్ళే అవకాశం ఉందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Giddalur former Mla Anna Rambabu meeting with his followers in Market Yard in Giddalur on Friday. He resigned to Tdp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X