విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘గిడ్డి’ సంచలనం: బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖ జిల్లాలోని చింతపల్లిలో జరిగిన బాక్సైట్ వ్యతికేర సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

బాక్సైట్ గనుల జోలికొస్తే చంద్రబాబు నాయుడు తల నరుకుతామని గిడ్డి ఈశ్వరి ప్రకటించడంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ప్రతిపక్ష నేత, వైయస్ జగన్ సమక్షంలో గిడ్డి ఈశ్వరి ఆవేశపూరితంగా ప్రసంగించడంతో పాటు చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు.

చంద్రబాబును నరరూప రాక్షసుడిగానే కాక వెన్నుపోటుదారుడు, దగాకోరుగా ఆమె అభిర్ణించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ నిషేధిత మావోయిస్టులు ముగ్గురు టీడీపీ గిరిజన నేతలను అపహరించిన ఘటనను ప్రస్తావించిన ఈశ్వరి, పార్టీ జెండా మోసిన గిరిజనులకు కష్టం వస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదన్నారు.

బాక్సైట్ గనుల తవ్వకాలపై పోరాటానికి మద్దతుగా తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె, టీడీపీ అభ్యర్థికి డిపాజిట్‌ను కూడా గల్లంతు చేస్తానని సభకు హాజరైన ప్రజల ముందు చెప్పారు. ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ వస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆమె సవాల్ విసిరారు.

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

అంతక ముందు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని, ఎటువంటి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరగనీయబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చింతపల్లిలో గురువారం జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద అబద్దాలకోరంటూ విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రంలో బాక్సైట్ తవ్వకాలకు స్థానిక గ్రామసభల అనుమతులు ఉన్నాయంటూ చెప్పడంపై ఆదీవాసీలు పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారన్నారు.

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

గ్రామసభల అంగీకారం లేకుండా బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభల అంగీకారం లేదంటూ ముక్తకంఠంతో చెబుతున్న స్థానిక ఆదివాసీలే ఉద్యమించారని జగన్ తెలిపారు. బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షల గొంతులు ఒక్కటయ్యాయన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు రాసి, అనుమతులు పొందారన్నారు.

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

బాక్సైట్‌కు తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసిపోరాడుదామని ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు. గిరిజనుల మనుగడకు తీవ్ర విఘాతం కలిగించే బాక్సైట్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైఎస్సార్‌సిపికి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఆరుగురు ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయలేదని జగన్ విమర్శించారు.

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

బాక్సైట్ జోలికోస్తే చంద్రబాబు తల నరుకుతామని ప్రకటన

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారన్నారు. ఎంపికైన డిఎస్సీ అభ్యర్ధులకు ఇప్పటికీ నియామకాలు జరగలేదని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. తమ పిల్లలు ప్రయోజకులు అవుతారనే కొండంత ఆశతో పేద కుటుంబాలు అప్పులు చేసి మరీ పిల్లలను పట్టణాలకు పంపించి డిఎస్సీ శిక్షణ ఇప్పించారన్నారు. ఈ విధంగా ఎంపికైన అనేకమందికి ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు నిర్వహించలేదన్నారు. దీనివల్ల వీరంతా రోడ్డున పడుతున్నారన్నారు. బహిరంగసభకు ప్లకార్డులతో వచ్చిన డిఎస్సీ అభ్యర్ధుల నుంచి వాటిని తీసుకుని జగన్ ప్రదర్శించారు.

English summary
YSRCP MLA Giddi Eeswari sensational comments on ap cm chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X